పెన్పహాడ్, ఫిబ్రవరి 13 : పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల వీడ్కోలు వేడుకలు వైభవంగా జరిగాయి. పాఠశాల యాజమాన్యం, ఇతర విద్యార్థులు 12వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోడి లింగయ్య ప్రసంగిస్తూ విద్యార్థులు పాఠశాలలో చదువుకున్న సమయంలో వారు సాధించిన విజయాలు, ఎదుగుదలపై గర్విస్తూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. వీడ్కోలు సందర్భంగా 11వ తరగతి విద్యార్థుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 2025- 26 విద్యా సంవత్సరంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికేట్లు అందజేశారు.

అనాజీపురం మోడల్ స్కూల్లో ఘనంగా ఫేర్వేల్ డే