Harish Rao | బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | గోదావరి బోర్డు రూపొందించిన ఎజెండాను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా అని ప్రశ్నించారు.
Harish Rao | గోదావరి బోర్డు రూపొందించిన ఎజెండాను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం GRMB ఎజెండాలో పెడితే.. ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.
తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ఏపీ ప్రతిపాదిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు GRMBని నిలదీయలేదు? ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప.. తెలంగాణ ప్రయోజనాల పట్ల మీకు అసలు చిత్తశుద్ధి లేదా అని అడిగారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. మీ నామమాత్రపు లేఖలు తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుతాయా? అని అడిగారు. లేఖలతో పనులు కావు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేయాలని సూచించారు.
ఏపీ ప్రభుత్వం GRMB ఎజెండాలో పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అవి ఎజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలని.. అవసరమైతే.. ఆ అంశాలు వెనక్కి తీసుకోకపోతే GRMB సమావేశానికి హాజరు కాబోమని కరాఖండిగా తేల్చి చెప్పాలన్నారు. అలా కాకుండా మీ రాజకీయ అవసరాల కోసం మీటింగ్‌కు వెళ్లి.. అక్కడ తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పెట్టిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి.. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు.. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన విషయం అని హరీశ్‌రావు చెప్పారు. ప్రతిపక్షాలపై పిచ్చి ప్రేలాపనలు చేసే రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు చెబితే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగే GRMB సమావేశం ఎజెండాను ఉపసంహరించుకోకుండా నిర్వహిస్తే.. తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వేలాది మందితో GRMB కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. కేంద్రం చేతిలో ఉన్న GRMB, చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జల ద్రోహాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- GRMB
- harish rao
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

