Aazad hind party | రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసుడు
Aazad hind party | నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Nethaji Subhash Chandrabose) వారసత్వం రాజకీయ వేదికపైకి రాబోతున్నది. బోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ (Chandra Kumar Bose) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ‘ఆజాద్ హింద్ పార్టీ (Aazad hind party)’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
Aazad hind party : నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Nethaji Subhash Chandrabose) వారసత్వం రాజకీయ వేదికపైకి రాబోతున్నది. బోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ (Chandra Kumar Bose) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ‘ఆజాద్ హింద్ పార్టీ (Aazad hind party)’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతను ప్రధాన బలంగా చేసుకుని నేతాజీ అనుసరించిన సమ్మిళిత, లౌకిక భావజాలంతో ముందుకు సాగుతామని చెప్పారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్-జీ నిరసనలు తన నిర్ణయానికి ప్రధాన కారణమని చంద్రకుమార్ బోస్ తెలిపారు. నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వాలు, వ్యవస్థలపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాలు, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు సహా పలు రంగాల్లో అవినీతి పెరిగిందని బోస్ ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విసిగిపోయిన యువతకు తమ హక్కుల కోసం పోరాడేందుకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని చెప్పారు.
అందుకే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో స్ఫూర్తి పొందిన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రకుమార్ బోస్ 2016లో బీజేపీలో చేరారు. ఏడేళ్లపాటు ఆ పార్టీలో కొనసాగారు. నేతాజీ సిద్ధాంతాల ప్రచారం కోసం ‘ఆజాద్ హింద్ మోర్చా’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. బీజేపీలో చేరడం తన తప్పిదమని గతంలో వ్యాఖ్యానించారు. 2026 ఏప్రిల్‌లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో చేరారు.
నేతాజీ భావజాలంపై పనిచేసే అవకాశం ఉంటుందని భావించినట్లు తెలిపారు. అయితే నాలుగు నెలలకే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆగస్టు 3న వ్యక్తిగత కారణాలతో తప్పుకొంటున్నట్లు మమతా బెనర్జీకి లేఖ రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

