Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని (IndiGo Employee) హత్య కేసు (Murder Case) దర్యాప్తులో అనూహ్య కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మృతురాలి స్నేహితుడి భార్యే హంతకురాలిగా దర్యాప్తులో తేలింది. తన భర్తతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నదన్న అక్కసుతో మృతురాలి స్నేహితుడి భార్యే కిరాయి హంతకులను పెట్టి మరీ ఇండిగో ఉద్యోగినిని హత్య చేయించినట్లు ఆధారాలు సంపాదించారు.
Indigo Employee : ఇండిగో ఉద్యోగిని (IndiGo Employee) హత్య కేసు (Murder Case) దర్యాప్తులో అనూహ్య కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మృతురాలి స్నేహితుడి భార్యే హంతకురాలిగా దర్యాప్తులో తేలింది. తన భర్తతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నదన్న అక్కసుతో మృతురాలి స్నేహితుడి భార్యే కిరాయి హంతకులను పెట్టి మరీ ఇండిగో ఉద్యోగినిని హత్య చేయించినట్లు ఆధారాలు సంపాదించారు.
స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఇండిగో ఉద్యోగిని వర్ష తుర్కర్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. మృతురాలు వర్షా తుర్కర్ స్నేహితుడి భార్యే సుపారీ గ్యాంగ్‌తో ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన 35 ఏళ్ల వర్ష పుణె విమానాశ్రయంలోని ఇండిగో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్నది.
దీపావళి పండుగ కోసం ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆమె నవంబర్ 14న తన స్నేహితుడు నితేశ్ అగర్వాల్‌తో కలిసి అటవీ ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లింది. సాయంత్రం వారు తిరిగొస్తుండగా ముగ్గురు దుండగులు అడ్డగించి వర్షపై దాడి చేశారు. కత్తితో ఆమెను దారుణంగా పొడిచారు. తీవ్ర గాయాలైన ఆమె ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ దాడి గురించి వర్ష బంధువులకు నితేశ్ ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడిలో నితేశ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు తొలుత అతడిని అనుమానించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత ఘటనాస్థలంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి దుండగుల్లో ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్‌లో అతడు అసలు విషయం వెల్లడించాడు. వర్షతో నితేశ్ వివాహేతర బంధం పెట్టుకున్నాడని, దీంతో అతడి భార్య మోనా ఈ హత్యకు పథకం వేసిందని తెలిపాడు.
వర్షను చంపడం కోసం మోనా ఓ సుపారి గ్యాంగ్‌తో రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితుడు చెప్పాడు. దాంతో పోలీసులు నితేశ్ భార్య మోనాను, మరో ముగ్గురు కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
Exercises | ఇంట్లోనే కండరాల పెరుగుదలకు 7 వ్యాయామాలు.. ఇవి చేస్తే చాలు..
నల్లగొండ విద్యార్థికి జాతీయ బాల ప్రతిభా పురస్కారం
భూముల రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ హరిసింగ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

