రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
కోదాడ పట్టణంలోని వంటిపులి గోపయ్య మైదానంలో నవంబర్ 20 తేదీ శుక్రవారం నుండి డిసెంబర్ 6వ తేదీ ఆదివారం వరకు 'శ్రీ కృష్ణ కాలచక్రం 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ కృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు.
– లోక కల్యాణమే ధ్యేయంగా మహాయాగం
– అయుత చండీ, అతిరుద్రం, సీతారామ పట్టాభిషేకానికి సర్వం సిద్ధం
– స్వరూపానంద స్వామీజీ
కోదాడ, నవంబర్ 19 : కోదాడ పట్టణంలోని వంటిపులి గోపయ్య మైదానంలో నవంబర్ 20 తేదీ శుక్రవారం నుండి డిసెంబర్ 6వ తేదీ ఆదివారం వరకు ‘శ్రీ కృష్ణ కాలచక్రం 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ కృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. యాగశాల వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ ప్రముఖులతో కలిసి స్వామీజీ మహాయాగ వివరాలను వెల్లడించారు. విశ్వశాంతితో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి లేకుండా నిరంతరం ప్రజలందరూ పాడిపంటలతో, సుఖశాంతులతో ఉండటమే ఈ మహాయాగం ముఖ్య ఉద్దేశమని స్వామీజీ పేర్కొన్నారు. ఈ మహాయాగంలో విష్ణు పంచాయతనం, అయుత చండీ, అతిరుద్రం, మహాసౌర, మహాగణపతి, లక్ష్మీనారాయణ, సుదర్శన యాగాలు, కోటి కుంకుమార్చనలు, కోటి దీపోత్సవం,చతుర్వేద పూర్వక రామాయణ, భాగవత హవనాలు మరియు శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం వంటి విశేష క్రతువులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భక్తులందరూ పెద్ద సంఖ్యలో యాగంలో పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు. ఈ యజ్ఞం పరిపూర్ణంగా, దిగ్విజయంగా జరిగేందుకు ప్రజలందరూ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ ఎమ్మేని వెంకటరత్నం బాబు, లారీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రామినేని శ్రీనివాస్, కిట్స్ కళాశాల చైర్మన్ వీర సత్యనారాయణ, వనపర్తి లక్ష్మీనారాయణ నిర్వాహకులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
Exercises | ఇంట్లోనే కండరాల పెరుగుదలకు 7 వ్యాయామాలు.. ఇవి చేస్తే చాలు..
నల్లగొండ విద్యార్థికి జాతీయ బాల ప్రతిభా పురస్కారం
భూముల రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ హరిసింగ్
ఎంపీ చామల కనిపించడం లేదంటూ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

