Winter Olympics | వింటర్ ఒలింపిక్స్ విలేజ్‌లో కండోమ్స్ కొరత.. మూడు రోజుల్లో 10,000 ప్యాకెట్ల కండోమ్స్ ఖతం
Winter Olympics : మిలాన్-కోర్టినా వేదికగా వింటర్ ఒలింపిక్స్ 2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రీడలు జరుగుతున్న అథ్లెటిక్స్ గ్రామంలో ప్రస్తుతం కండోమ్‌లకు కొరత ఏర్పడింది.
Winter Olympics : మిలాన్-కోర్టినా వేదికగా వింటర్ ఒలింపిక్స్ 2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రీడలు జరుగుతున్న అథ్లెటిక్స్ గ్రామంలో ప్రస్తుతం కండోమ్‌లకు కొరత ఏర్పడింది. క్రీడా గ్రామంలో అందించే ఉచిత కండోమ్స్ స్టాక్ అయిపోవడంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. క్రీడాకారులు, ప్రేక్షకులు, సిబ్బందికి కలిపి 10,000 కండోమ్స్ ప్యాకెట్లు ఉచితంగా అందజేయగా.. అవి మూడు రోజుల్లోనే అయిపోయాయి.
2,900 మంది అథ్లెట్ల కోసం వీటిని నిర్వాహకులు అందించారు. అయితే, ఇప్పుడీ స్టాక్ అయిపోవడంతో మళ్లీ కొత్త స్టాక్ తెప్పించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. 10,000 ప్యాకెట్లు ఇంత త్వరగా అయిపోతాయని నిర్వాహకులు అంచనావేయలేదు. దీంతో కొత్త స్టాక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అవి ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయో చెప్పలేకపోతున్నారు. మిగిలిన క్రీడలు పూర్తయ్యే వరకు అథ్లెట్స్‌కు కండోమ్స్ అందుబాటులో ఉంచుతామని గేమ్స్ నిర్వాహకులు చెప్పారు. గతం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం ఉచిత కండోమ్స్‌ను ఒలింపిక్స్‌లో క్రీడాకారులకు నిర్వాహకులు అందిస్తారు. సాధారణంగా క్రీడాకారులు ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్లలో దగ్గరగా కలిసే ఉంటారు. రోజుల తరబడి, వారాల తరబడి కలిసే ఉండాల్సి ఉంటుంది.
దీంతో లైంగిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు నిర్వాహకులు వీటిని ఉచితంగా అందిస్తారు. 2024లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో 2,00,000 మేల్ కండోమ్స్, 20,000 ఫిమేల్ కండోమ్స్‌ను నిర్వాహకులు అందించారు. ఈ ఒలింపిక్స్ క్రీడల్లో 10,500 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. అయితే, 2021 కోవిడ్ సందర్భంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని, క్రీడాకారులు కలిసి ఉండటంపై పలు ఆంక్షలు విధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

