India Passport : హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకింగ్ పెరిగింది. అంటే మన పాస్‌పోర్ట్ విలువ పెరిగింది. అయినా, ఇండియాకు ఫ్రీ వీసా ఇచ్చే దేశాల సంఖ్య తగ్గింది. తాజాగా రెండు దేశాలు ఇండియన్స్‌కు ఇప్పటిదాకా ఉన్న ఫ్రీ వీసా సౌకర్యాన్ని ఇటీవల రద్దు చేశాయి. ఇరాన్, బొలీవియా దేశాలు ఇండియాకు ఫ్రీ వీసా సౌకర్యాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో మన పాస్‌పోర్ట్ 75వ స్తానంలో నిలిచింది.
గత ఏడాది ఇదే సమయంలో 85వ స్తానంలో ఉంది. అంటే ఇప్పుడు ర్యాంకింగ్‌లో 10 స్థానాలు ఎగబాకింది. గత జనవరిలో 80 వ ర్యాంక్‌కు చేరుకోగా, ఇప్పుడు మరో ఐదు ర్యాంకింగ్స్ మెరుగుపడి 75వ ర్యాంక్‌లో ఉంది. ఇదే సమయంలో మన దేశానికి ఫ్రీ వీసా ఇచ్చే దేశాల సంఖ్య ప్రస్తుతం 56గా ఉంది. గత నెలలో మనకు ఫ్రీ వీసా ఇచ్చే దేశాల సంఖ్య 55 కాగా, ఇప్పుడు 56కు చేరింది. అయితే, గత ఏడాది ఇదే సమయంలో ఈ దేశాల సంఖ్య 57గా ఉండేది. అంటే వీసా ఫీజు చెల్లించకుండా, పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా అప్పట్లో మన పాస్‌పోర్ట్‌తో 57 దేశాలకు వెళ్లగలిగే వీలుండేది. ఇప్పుడు ఇరాన్, బొలీవియా దేశాలు ఫ్రీ వీసా లిస్టు నుంచి ఇండియాను మినహాయించాలి. అయితే, 57 దేశాల జాబితా నుంచి రెండు దేశాలు తప్పుకొంటే 55 దేశాలు ఉండాలి. కానీ, గాంబియా దేశం ఈ జాబితాలోకి తాజాగా చేరింది.
ఇండియన్స్‌కు ఫ్రీ వీసా ఇచ్చేందుకు అంగీకరించింది. ఇకపై ఇరాన్, బొలీవియా దేశాలకు వెళ్లాలంటే ముందుగానే వీసా దరఖాస్తు చేసుకోవాలి. వీసా ఉంటేనే దేశంలోకి అనుమతిస్తారు. సాధారణంగా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ పెరిగితే ఉచిత వీసా ఇచ్చే దేశాల సంఖ్య పెరుగుతుంది. కానీ, భారతీయులు ఇరాన్, బొలీవియా వంటి దేశాలు వెళ్లి అక్కడ సరైన ధృవపత్రాలు చూపించకపోవడం, నేరాలకు పాల్పడటం వంటి పనులు చేశారు. దీంతో ఆ దేశాలు ఇప్పుడు ఇండియన్స్ రాక విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నాయి.