బుధవారం 20 జనవరి 2021
Rangareddy - Dec 02, 2020 , 04:25:47

వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ

వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ

కందుకూరు : మండల కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం కొనుగోలు ఊపందుకుంది. మండల పరిధిలోని 35 గ్రామపంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రతి మండల కేంద్రంలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. దీంతో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డి ప్రారంభించారు. ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోకుండా ఉండాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం అధికారులకు సూచించడంతో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ఎక్కువ మొత్తంలో వరి ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి రూ.1888, బీ గ్రేడ్‌ వరి ధాన్యానికి రూ.1868 నిర్ణయించారు. ప్రభుత్వం వరి ధాన్యానికి మంచి ధర నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు వెనువెంటనే డబ్బులు వారి బ్యాంక్‌ ఖాతాల్లో పడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

రైతులకు ఇబ్బందులు లేకుండా..- జంగారెడ్డి, జడ్పీటీసీ కందుకూరు

రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. సీఎం కేసీఆర్‌ రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. పండించిన పంటలతో పాటు అనేక విధాలుగా రైతులను ఆదుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని రుజువైంది. రైతులు ఎల్లప్పుడూ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.

ప్రభుత్వం ద్వారా కొనుగోలు - చంద్రశేఖర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌, కందుకూరు

ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. గతంలో ఈ విధంగా లేకుండా ఉండేది. సీఎం కేసీఆర్‌ రైతులకు మంచి అవకాశాన్ని కల్పించారు.

దళారుల బెడద తప్పింది : లోకేశ్వర్‌రెడ్డి, రైతు, కొత్తగూడ 

తాము పండించిన పంటలను మధ్య దళారులకు విక్రయించేవాళ్లం. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో దళారుల బెడద తప్పింది. తాము పండించిన పంటలకు ప్రభుత్వమే ధర ఖరారు చేసి కొనుగోలు చేయడం రైతుల అదృష్టం. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో రైతులకు న్యాయం జరుగుతున్నది.


logo