e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News డ‌బ్ల్యూటీసీ పేలుడు కేసులో న‌లుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

డ‌బ్ల్యూటీసీ పేలుడు కేసులో న‌లుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

డ‌బ్ల్యూటీసీ పేలుడు కేసులో న‌లుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

అమెరికా న్యూయార్క్‌లోని అతిపెద్ద జంట ట‌వ‌ర్లు అయిన‌ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పార్కింగ్‌లో 1993 లో జ‌రిగిన పేలుడులో నిందితుల‌కు ఏడాది త‌ర్వాత స‌రిగ్గా ఇదే రోజున 240 సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించారు. 1993 ఫిబ్రవరి 26 న ఉద‌యం 12:00 గంట‌ల‌కు వ‌రల్డ్ ట్రేడ్ సెంట‌ర్ పార్కింగ్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగిన ప్రదేశంలో 60 అడుగుల వెడల్పు, 90 అడుగుల లోతులో గొయ్యి ఏర్ప‌డింది. ఆరుగురు మరణించ‌గా.. దాదాపు వేయి మందికి పైగా గాయపడ్డారు. కేసును విచారించిన న్యూయార్క్ కోర్టు న‌లుగురు ఉగ్రవాదులకు 240 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

పాకిస్తాన్ నుంచి ఇద్దరు ఉగ్రవాదులు అహ్మద్ ఇజాజ్, రాంజీ యూసుఫ్.. వివిధ విమానాల ద్వారా నకిలీ పాస్‌పోర్టుల‌తో అమెరికా వచ్చారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాన్ని కూల్చివేయడమే వీరి ఉద్దేశం. వీరిని గుర్తించిన పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. సూట్‌కేస్‌లో పేలుడు పదార్థాలు దొరకడంతో అహ్మ‌ద్ ఇజాజ్‌ను జైలుకు పంపారు. మిగ‌తా వారు న్యూజెర్సీలోని ఒక గ్యారేజీని అద్దెకు తీసుకుని 680 కిలోల బాంబును త‌యారుచేశారు.

ఒక‌ ట్రక్కును అద్దెకు తీసుకున్న‌వీరు.. బాంబును వ‌రల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో పెద్ద పేలుడు సంభ‌వించింది. ఇంత శ‌క్తివంత‌మైన పేలుడుకు భ‌వంన కూలిపోతుంద‌ని ఉగ్ర‌వాదులు భావించిన‌ప్ప‌టికీ అది జ‌రుగ‌లేదు. అయితే ఆరుగురు మ‌ర‌ణించ‌గా.. వేయికి పైగా ప్ర‌జ‌లు గాయ‌ప‌డ్డారు.

పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత వీరంతా త‌మ‌ దేశాలకు పారిపోయారు. తర్వాతి రెండు రోజుల్లో ట్రక్ న్యూజెర్సీ అద్దె సంస్థకు చెందినదని ఎఫ్‌బీఐ కనుగొన్న‌ది. ద‌ర్యాప్తును త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసిన పోలీసులు మే నెల నాటిక‌ల్లా నిందితుల‌ను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట ప్ర‌వేశ‌పెట్టింది. కేసు విచారణ 1993 సెప్టెంబర్ 16 న ప్రారంభమై.. 1994 మే 24 వ‌ర‌కు కొన‌సాగింది. చివ‌ర‌కు నిందితులకు 240 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2019: గుజరాత్‌ సూరత్‌లోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం, 20 మంది విద్యార్థులు దుర్మర‌ణం

2015: కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి క‌ప్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్

2001: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలుగా నిలిచిన నేపాల్‌కు చెందిన 15 ఏళ్ల షెర్పా టెన్బా షెరీ

2000: సినీ గీత‌ రచయిత, కవి మజ్రూ సుల్తాన్‌పురి మరణం

1964 : పెరు రాజ‌ధాని లిమాలోని జాతీయ స్టేడియంలో ఫుట్‌బాల్ అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌, 328 మంది మృతి

1930: ఒంటరిగా విమానం ద్వారా ఇంగ్లండ్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణించిన అమీ జాన్సన్

1915: టెలిస్క్రైబ్‌ను కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్

ఇవి కూడా చ‌ద‌వండి..

అమెరికాలో మ‌రో న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంపై వివాదం.. తాజాగా వీడియో బ‌య‌ట‌కు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ

ఎక్కువ జిగురు కోసం చెట్ల‌కు విష‌పూరిత‌ ఇంజెక్ష‌న్లు..

నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ‌ డొమినోజ్‌ డాటా లీక్‌..!

సెప్టెంబ‌ర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డ‌బ్ల్యూటీసీ పేలుడు కేసులో న‌లుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement