Shivakumar | ఏడేళ్ల ప్రేమకు పెళ్లి ముహూర్తం.. ప్రియాంక జైన్‌తో వివాహంపై క్లారిటీ ఇచ్చిన శివకుమార్
Shivakumar | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో పరిచయమైన జంటల్లో ప్రియాంక జైన్, శివకుమార్ ఒకరు. ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ మొదట మంచి స్నేహితులుగా మారి, ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రస్తుతం లివ్-ఇన్ రిలేషన్షిప్లో కూడా కొనసాగుతోంది.
Shivakumar | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో పరిచయమైన జంటల్లో ప్రియాంక జైన్, శివకుమార్ ఒకరు. ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ మొదట మంచి స్నేహితులుగా మారి, ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రస్తుతం లివ్-ఇన్ రిలేషన్షిప్లో కూడా కొనసాగుతోంది.వీరి ప్రేమ వ్యవహారం గురించి అభిమానులకు ఎప్పటి నుంచో తెలుసు. దీంతో సోషల్ మీడియాలోనూ, ఇంటర్వ్యూల్లోనూ వీరిద్దరికి తరచూ ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే.. “పెళ్లి ఎప్పుడు?” అనే విషయం. తాజాగా ఈ ప్రశ్నకు శివకుమార్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ ప్రేమ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మాది ఏడేళ్ల ప్రేమ. మొదట ప్రియాంకే నాకు ప్రపోజ్ చేసింది. ఆమె ప్రపోజ్ చేసిన రెండు రోజుల తర్వాత నేను ఓకే చెప్పాను. అప్పటి నుంచి మా బంధం మరింత బలపడింది అని తెలిపారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై కూడా ఆయన స్పందించారు. మేము కలిసి ఉండటానికి ముందే మా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నాం. రెండు కుటుంబాలు కూడా మా నిర్ణయాన్ని గౌరవించాయి. వారి అంగీకారంతోనే మేము లివ్-ఇన్‌లో ఉన్నాం అని చెప్పారు. పెళ్లి విషయానికి వస్తే, ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఒక ఇంటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మా కలల ఇల్లు నిర్మాణంలో ఉంది. అది పూర్తయిన వెంటనే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాం. పెళ్లి కోసం ఇప్పటికే కొన్ని ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం అని అన్నారు.
తమ వివాహాన్ని ఉత్తరాఖండ్‌లోని ఓ పవిత్ర ఆలయంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. యోగి నారాయణ్ ఆలయంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం కూడా అక్కడే జరిగినట్లు చెబుతారు. అందుకే ఆ ప్రదేశం మాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది అని వివరించారు.ఆలయంలో సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిన అనంతరం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే భవిష్యత్తులో నిర్మిస్తున్న ఇంట్లో రెండు కుటుంబాలు కలిసి ఉండేలా ప్రణాళికలు వేసుకున్నామని వెల్లడించారు. నేను నా కుటుంబంతో, ప్రియాంక తన కుటుంబంతో కాకుండా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాం. కుటుంబ బంధాలకు మేము ఎంతో విలువ ఇస్తాం అని శివకుమార్ తెలిపారు.ఇప్పటికే బుల్లితెరపై అభిమాన జంటగా గుర్తింపు పొందిన ప్రియాంక జైన్, శివకుమార్ త్వరలో నిజ జీవితంలోనూ భార్యాభర్తలుగా మారబోతుండటంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

