అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం రాజుకున్నది. దానికి సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చింది

న్యూయార్క్ : అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం రాజుకున్నది. దానికి సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో నల్ల జాతీయుడి కారును పోలీసుల ఆపేందుకు చేసిన ప్రయత్నంలో కారు చెట్టుకు గుద్దుకున్నది. ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. నిజానికి ఈ ఘటన 2019 మే 10 వ తేదీన అమెరికాలోని లూసియానాలో జరిగింది.
అమెరికా లూసియానాలోని పోలీసులు తన కారును వెంబడించడంతో రోనాల్డ్ గ్రీన్ అనే నల్లజాతి పౌరుడు చెట్టుకు గుద్దుకుని చనిపోయాడు. జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అట్టుడికిపోయిన అమెరికా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో పోలీసులు రోనాల్డ్ను కొట్టడం కనిపిస్తున్నది. క్షమించాలంటూ రోనాల్డ్ చేసిన అరుపులు కూడా వినిపించాయి.
రోనాల్డ్ గ్రీన్ మరణంపై పోలీసుల క్లెయిం..
మొదటి క్లెయిం : ఈ కేసు 2019 మే 10 నాటిది. 49 ఏండ్ల రోనాల్డ్ గ్రీన్ కారును ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. ఉల్లంఘనలు ఏమిటో పోలీసులు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, రోనాల్డ్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రీన్ కారు చెట్టును ఢీకొట్టడంతో గ్రీన్ చనిపోయాడని పోలీసులు గ్రీన్ బంధువులకు చెప్పారు.
రెండవ క్లెయిం : పోలీసులు తమ వ్రాతపూర్వక నివేదికలో.. ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు.. గ్రీన్ కష్టపడ్డాడని చెప్పారు. అతను ప్రమాదం నుండి బయటపడ్డాడని, అతనికి గాయాలు అయ్యాయని, ఆసుపత్రికి వెళ్తుండగా మరణించాడని చెప్పారు.
కేసు నమోదు చేసిన గ్రీన్ కుటుంబం
పోలీసులను సస్పెండ్ చేసిన తర్వాత తిరిగి విధుల్లోకి వచ్చిన అధికారులపై గ్రీన్ కుటుంబం 2020 లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో పేరుపొందిన పోలీసులను సస్పెండ్ చేసినప్పటికీ వారు తిరిగి విధుల్లోకి వచ్చారని, అప్పటి విధుల్లో ఉన్న పోలీసుల్లో ఒకరు కారు ప్రమాదంలో మరణించారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
ఎక్కువ జిగురు కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు..
నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ డొమినోజ్ డాటా లీక్..!
సెప్టెంబర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
టిబెట్‌ను ఆక్రమించిన చైనా.. చరిత్రలో ఈరోజు
అది కాపీరైట్ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

