e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News టిబెట్‌ను ఆక్ర‌మించిన చైనా.. చ‌రిత్ర‌లో ఈరోజు

టిబెట్‌ను ఆక్ర‌మించిన చైనా.. చ‌రిత్ర‌లో ఈరోజు

టిబెట్‌ను ఆక్ర‌మించిన చైనా.. చ‌రిత్ర‌లో ఈరోజు

ప్ర‌పంచానికి పైక‌ప్పుగా పేరుగాంచిన టిబెట్‌ను 1951 లో స‌రిగ్గా ఇదే రోజున చైనా ఆక్ర‌మించింది. ఈ రోజునే టిబెట‌న్లు బ్లాక్ డేగా భావిస్తారు. ఇది జ‌రిగిన 8 సంవత్సరాల తర్వాత దలైలామా భారతదేశానికి వచ్చారు.

వాస్తవానికి చైనా-టిబెట్ మధ్య వివాదం చాలా సంవత్సరాలది. 13వ‌ శతాబ్దంలో టిబెట్ చైనాలో ఒక భాగమని, అందువల్ల టిబెట్‌పై హక్కు త‌మ‌కు ఉన్న‌దని చైనా చెప్తున్న‌ది. చైనా వైపు నుంచి వ‌స్తున్న ఈ వాదనను టిబెట్ తిరస్కరిస్తున్న‌ది. 1912 లో టిబెట్ 13 వ దలైలామా టిబెట్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. ఆ సమయంలో చైనా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ దాదాపు 40 ఏండ్ల త‌ర్వాత‌ కమ్యూనిస్ట్ ప్రభుత్వం చైనాలో అధికారంలోకి రాగానే రాజ్య విస్త‌ర‌ణ కాంక్ష పెంచుకున్న‌ది. దాంతో 1950 లో వేలాది మంది సైనికులతో టిబెట్‌పై దాడి చేసింది. టిబెట్‌పై చైనా ఆక్రమణ దాదాపు 8 నెలలు కొనసాగింది.

చివరికు టిబెటన్ మత నాయకుడు దలైలామా 17 పాయింట్ల ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం తర్వాత‌ టిబెట్ అధికారికంగా చైనాలో భాగమైంది. అయితే, ఈ ఒప్పందాన్ని దలైలామా అంగీకరించడంలేదు. బలవంతపు ఒత్తిడితో ఈ ఒప్పందం జరిగిందని ఆయన చెప్తున్నారు. 1955 తర్వాత చైనాకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు టిబెట్ అంతటా ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో మొదటి తిరుగుబాటు జరిగింది. దీనిలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

మార్చి 1959 లో చైనా దలైలామాను బందీగా తీసుకోబోతున్న‌ద‌ని వార్తలు వ్యాపించాయి. దాంతో దలైలామా ప్యాలెస్ వెలుపల వేలాది మంది గుమిగూడారు. చివరికి సైనికుడి వేషంలో ఉన్న దలైలామా టిబెట్ రాజధాని లాసా నుంచి భారతదేశానికి పారిపోయారు. భారత ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం ఇచ్చింది. చైనాకు ఈ విషయం నచ్చలేదు. 1962 భారత-చైనా యుద్ధానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని చెప్తుంటారు. దలైలామా ఇప్పటికీ భారతదేశంలోనే ఉన్నారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2019: సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం. వ‌రుస‌గా రెండోసారి ప్ర‌ధానిగా నరేంద్ర మోదీ ఎంపిక‌

2015: కారు ప్రమాదంలో మరణించిన అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ నాష్

2010: స‌హ‌జీవ‌నం స‌బ‌బే అని తీర్పు వెలువ‌రించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం

2008: పృథ్వీ -2 ను ఉపరితలం నుంచి ఉపరితలం వరకు క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భార‌త్‌

2004: బంగ్లాదేశ్‌లో తుఫాను కారణంగా మేఘనా నదిలో పడవ బోల్తా, దాదాపు 250 మంది దుర్మ‌ర‌ణం

1995: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అధికారికంగా ప్రారంభం

1994: సౌదీ అరేబియాలో హజ్ సందర్భంగా తొక్కిసలాట, 270 మంది యాత్రికులు మరణం

1984 : ఎవ‌రెస్ట్ ప‌ర్వతాన్ని అధిరోహించిన తొలి మ‌హిళ‌గా రికార్డు నెల‌కొల్పిన ప‌ద్మ‌భూష‌న్ బ‌చేంద్రిపాల్ జ‌న‌నం

1942: దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, కొరియోగ్రాఫర్ కే రాఘవేంద్రరావు జన‌నం

1788: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 8 వ రాష్ట్రంగా చేరిన దక్షిణ కరోలినా

ఇవి కూడా చ‌ద‌వండి..

అది కాపీరైట్‌ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు

రెజ్ల‌ర్ సాగ‌ర్ హ‌త్య కేసులో ఒలింపియ‌న్ సుశీల్ అరెస్ట్‌

మార్స్‌పై ప‌ని మొద‌లుపెట్టిన‌ చైనా రోవ‌ర్

సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్‌

క‌రోనా వేళ మోదీ, సోనియా, ఇత‌ర యూపీ ఎంపీలు ఎక్క‌డున్నారు.. ఏంచేస్తున్నారు..?

సువేందు అధికారి తండ్రి, సోద‌రుడికి వై ప్ల‌స్ భ‌ద్ర‌త‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టిబెట్‌ను ఆక్ర‌మించిన చైనా.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement