e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్ కోసం 'హైటెక్ థర్డ్ ఐ' రెడీ

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్ కోసం 'హైటెక్ థర్డ్ ఐ' రెడీ

న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ విన‌యోగ‌దారులు న‌డుచుకుంటూ వెళ్తూనే మొబైల్ ఫోన్ల‌ను వాడుకునేందుకు వీలుగా హైటెక్ థ‌ర్డ్ ఐ సిద్ధ‌మైంది. ఈ థ‌ర్డ్ ఐ ని క‌లిగివుండే వారు ర‌ద్దీ ప్ర‌దేశాల్లో కూడా ఎలాంటి బెరుకులేకుండా న‌డుస్తూనే మొబైల్ ఫోన్‌ను ఆప‌రేట్ చేసుకునే వీలుంటుందంట‌. అచ్చం సీసీటీవీ కెమెరా మాదిరిగా ఉండే ఈ డివైజ్‌ను ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన్ స్టూడెంట్ అయిన మిన్వూక్ పెంగ్ త‌యారుచేశారు. మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేసి మ‌రింత ఈజీగా వినియోగించుకునేందుకు సిద్ధం చేస్తాన‌ని పెంగ్ చెప్తున్నాడు.

స్మార్ట్‌ఫోన్ వాడే వ్యసనం ఈ తరం వారిలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ది. వాకింగ్ చేస్తూ, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తరచుగా స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఎదురుగా ఏం జ‌రుగుతున్నా ప‌ట్టించుకోకుండా త‌మ దృష్టి అంతా తాము చేసే చాటింగ్‌ల‌పైనే ఉంచుతారు. దాంతో వారిని ఏ వాహ‌న‌మో, ఇంకా ఏదైనా గుద్దుకున్నా వీరికి తెలియ‌దు. అంత‌టా స్మార్ట్ ఫోన్ ప్రేమ‌లో మునిగిపోతున్నారు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన్ స్టూడెంట్ అయిన మిన్వూక్ పెంగ్ హైటెక్ థ‌ర్డ్ ఐని రెడీ చేశారు.

మ‌న‌ కళ్ళు రెండూ ఫోన్ వైపు చూస్తున్నప్పుడు.. మూడవ కన్ను చురుకుగా మారుతుందని, దీని సాయంతో ప్రమాదాలు జ‌రుగ‌డానికి ఆస్కారం లేదని పెంగ్ చెప్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్, బ్రౌజ్ చేస్తున్నప్పుడు రద్దీగా ఉండే ప్రదేశంలో కూడా సులభంగా నడుస్తూ వెళ్లిపోవ‌చ్చ‌ని అభ‌య‌మిస్తున్నాడు పెంగ్‌.

తల క్రిందికి రాగానే యాక్టివేట్ అవుతుంది..

ఈ థ‌ర్డ్ ఐ మ‌న త‌ల‌కు బిగించుకోవాలి. త‌ల ఎప్పుడైతే క్రిందికి వ‌స్తుందో అప్పుడు థ‌ర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందని పెంగ్ పేర్కొన్నారు. ఈ థ‌ర్డ్ ఐ పారదర్శక ప్లాస్టిక్‌ను కలిగి ఉంటుంది. ఇది డాట్ వంటి జెల్ ప్యాడ్ సాయంతో నుదిటిపై అతికించుకోవాలి. ఈ ప్లాస్టిక్ లోపల చిన్న స్పీకర్, గైరోస్కోప్ , సోనార్ సెన్సార్ అమర్చబడి ఉంటాయి. వినియోగదారు తన తలను కిందికి దించిన‌ వెంటనే థ‌ర్డ్ ఐ ప‌ని చేయ‌డం ప్రారంభిస్తుంది. థ‌ర్డ్ ఐ లోని సోనార్ ఆయా ప్రాంతాల‌ను పర్యవేక్షించడానికి సాయ‌ప‌డుతుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్ మ‌న నుంచి దూరాన్ని కనుగొంటుంది. గోడ, సరిహద్దు, రాయి వంటివి వినియోగదారుల ముందు ప్రాంతంలోకి రాగానే స్పీకర్ నుంచి అలారం మోగడం ప్రారంభించి అప్రమత్తం చేస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఎక్కువ జిగురు కోసం చెట్ల‌కు విష‌పూరిత‌ ఇంజెక్ష‌న్లు..

నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ‌ డొమినోజ్‌ డాటా లీక్‌..!

సెప్టెంబ‌ర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?

టిబెట్‌ను ఆక్ర‌మించిన చైనా.. చ‌రిత్ర‌లో ఈరోజు

అది కాపీరైట్‌ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు

రెజ్ల‌ర్ సాగ‌ర్ హ‌త్య కేసులో ఒలింపియ‌న్ సుశీల్ అరెస్ట్‌

క‌రోనా వేళ మోదీ, సోనియా, ఇత‌ర యూపీ ఎంపీలు ఎక్క‌డున్నారు.. ఏంచేస్తున్నారు..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్ కోసం 'హైటెక్ థర్డ్ ఐ' రెడీ

ట్రెండింగ్‌

Advertisement