లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన.. సోదరుడి పెళ్లిలో తహసీల్దార్ డ్యాన్స్..
తహసీల్దార్ డ్యాన్స్ | ఒడిశాకు చెందిన ఓ తహసీల్దార్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించింది. తన సోదరుడి వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన బరాత్

భువనేశ్వర్ : ఒడిశాకు చెందిన ఓ తహసీల్దార్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించింది. తన సోదరుడి వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన బరాత్ కార్యక్రమంలో ఆ తహసీల్దార్ మాస్కు ధరించలేదు. అంతేకాకుండా.. అక్కడున్న వారితో కలిసి డ్యాన్స్ చేసింది. కరోనా కట్టడి కోసం ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోంది. వివాహ వేడుకలకు కేవలం 25 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఓ మహిళా తహసీల్దార్ తన సోదరుడి వివాహానికి హాజరైంది. ఈ వేడుకలో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా సదరు తహసీల్దార్ మాస్కు ధరించకుండా స్టెప్పులేసింది. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలపై జాజ్పూర్ జిల్లా కలెక్టర్ చక్రవర్తి సింగ్ రాథోడ్ స్పందించారు. ప్రస్తుతం ఆ మహిళా ఆఫీసర్ సెలవులో ఉన్నారు. సెలవులు ముగిసి వీధుల్లో హాజరైన తర్వాత ఆమె నుంచి వివరణ కోరి, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఆఫీసరే.. నిబంధనలు ఉల్లంఘించడం సరికాదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Lockdown
- Marriage
- Odisha
- Tahasildar
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

