తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
ఇప్పటికే చర్మం, కండ్లు, మెదడు, కాలేయం వంటివి కృత్రిమంగా తయారుచేసిన శాస్త్రవేత్తలు.. తాజాగా ఒక చిన్న గుండెను సృష్టించారు.

వియన్నా : వైద్య రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో ఆధునిక పరికరాలు, కృత్రిమ అవయవాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఎంతటి వ్యాధినైనా ఇట్టే కనిపెట్టేసి చికిత్స అందించే సామర్థ్యం వైద్యులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే చర్మం, కండ్లు, మెదడు, కాలేయం వంటివి కృత్రిమంగా తయారుచేసిన శాస్త్రవేత్తలు.. తాజాగా ఒక చిన్న గుండెను సృష్టించారు.
ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తల బృందం ఈ మినీ గుండెను ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. ఇది అచ్చం 25 రోజుల పిండం మాదిరిగా ఉన్నది. నువ్వుల విత్తనం ఆకారంలో మానవ మూలకణాలతో దీనిని తయారుచేశారు. దీని సృష్టతో ఇక ప్రతి గుండె జబ్బు రహస్యం తెలుసుకునే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు భావిస్తున్నారు. దీని ఆధారగా పిండస్థ దశలో ఉన్నప్పుడు గుండె జబ్బులు ఎలా వస్తాయో తెలుసుకునేందుకు వీలు చిక్కుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఈ సాంకేతిక గుండె అనేక పుట్టుకతో వచ్చే వ్యాధులను, మానవ గుండె రహస్యాలను బయటపెట్టడంలో సమర్థవంతంగా రుజువు చేస్తుందని ప్రఖ్యాత బయ్ ఇంజినీర్ జెన్ మా చెప్పారు. ఇప్పటివరకు జంతు నమూనాలపై ఆధారపడి చేసిన పరిశోధనల క్రమంలో ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణగా జెన్ మా పేర్కొంటున్నారు.
12 సంవత్సారాల మా కృషి ఫలించినందుకు సంతోషంగా ఉన్నదని, ఈ మినీ హార్ట్ తయారీకి గత మూడు నెలలుగా ల్యాబ్‌లోనే ఉన్నామని ప్రిన్సిపాల్ పరిశోధకుడు డాక్టర్ సాషా మెండ్జన్ చెప్పారు. చైనాలో కృత్రిమ గుండెను తయారుచేసినప్పటికీ.. అది మానవ మూలకణాలతో తయారుచేయలేదని ఆయన స్పష్టం చేశారు. దీని తయారీలో అయస్కాంత, ద్రవ లెవిటేషన్ పద్ధతులను ఉపయోగించామని, ఫలితంగా గుండె పని సామర్థ్యం పెరుగుతుందని మెండ్జన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
ఎక్కువ జిగురు కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు..
సెప్టెంబర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

