ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. నెలకు గరిష్ఠంగా రూ.15,000 వరకు జమ అవుతుంది. సాధారణంగా పీఎఫ్ అకౌంట్‌ను రిటైర్మెంట్ ప్రణాళికలో భాగంగానే పరిగణిస్తారు. అయితే పీఎఫ్‌తో ఆదాయం పన్ను (ఐటీ) చట్టం 80సీ సెక్షన్ ప్రకారం ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఐటీ మినహాయింపు ఉంది. ఇవే కాకుండా మరికొన్ని లాభాలూ ఉన్నాయి..
ఉచిత బీమా: ఉద్యోగంలో ఉండగానే మరణిస్తే ఈడీఎల్ఐ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు బీమా వస్తుంది.
రుణ సౌకర్యం: అత్యవసరాల కోసం ఒక శాతం వడ్డీకే రుణాలు తీసుకోవచ్చు. తిరిగి మూడేండ్లలో చెల్లించాలి. అనారోగ్యానికి గురైతే, పిల్లల పెండ్లి కోసం కూడా కొంత అప్పుగా తీసుకోవచ్చు.
సొంతింటి కోసం: ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి పీఎఫ్ బ్యాలన్స్‌లో 90% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. హోమ్‌లోన్ రీపేమెంట్, భూమి లేదా ప్లాట్ కొనుగోలుకూ వాడుకోవచ్చు.
పెన్షన్: 58 ఏండ్లు నిండితే పెన్షన్ పొందవచ్చు. అయితే కనీసం 15 ఏండ్లపాటు పీఎఫ్ ఖాతాలో నిరాటంకంగా జమ కావాల్సి ఉంటుంది.