e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News విదేశాల్లో కొవాగ్జిన్ ఉత్ప‌త్తిపై ఫోక‌స్‌! ఎలాగంటే!!

విదేశాల్లో కొవాగ్జిన్ ఉత్ప‌త్తిపై ఫోక‌స్‌! ఎలాగంటే!!

విదేశాల్లో కొవాగ్జిన్ ఉత్ప‌త్తిపై ఫోక‌స్‌! ఎలాగంటే!!

న్యూఢిల్లీ: క‌రోనా రెండో వేవ్ వ‌ణికిస్తున్న‌ది. అంద‌రికీ వ్యాక్సినేష‌న్ ద్వారానే దాన్ని నియంత్రించ‌గ‌ల‌మ‌ని వైద్య నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు నొక్కి చెబుతున్నారు. ప్ర‌స్తుతం దేశంలో ఫ‌స్ట్ డోస్ వేసుకుని.. రెండో డోస్ కోసం వేచి ఉన్న వారు భారీ స్థాయిలోనే ఉంటారు.. వారికి టీకా ఇచ్చేందుకు వ్యాక్సిన్ల కొర‌త వెంటాడుతున్న‌ది.

ఈ కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించ‌డానికి దేశీయ ఫార్మా మేజ‌ర్ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను విదేశాల్లో ఉత్ప‌త్తి చేయాల‌ని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న‌ది. ఈమేరకు కొవాగ్జిన్‌ ఉత్పత్తిని వేగంతం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) సహకారం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాల క‌థ‌నం.

ఇంకా మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సహా ఇతర వ్యాక్సిన్‌ల టెక్నాలజీ, ఫార్ములాల‌ను దేశీయ కంపెనీలకు బదిలీ చేసే అంశంపైనా చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధం అవుతున్న‌ది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకా డెవ‌ల‌ప్ చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేసేందుకు ఇత‌ర సంస్థ‌ల‌కు అనుమ‌తించే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ది.

అలాగే, కొవిషీల్డ్‌ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు ఉన్న అవ‌రోధాల ప‌రిష్కారానికి అవ‌స‌ర‌మైన కార్యాచరణను కేంద్రం సిద్ధం చేస్తున్నట్లు స‌మాచారం. వీటిపై భారత్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్‌ చేసిన అభ్యర్థనకు అమెరికా అధ్యక్ష భవనం కూడా సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తయారీ అత్యంత సంక్లిష్టమైందని నిపుణులు చెబుతున్నారు. సజీవ వైరస్‌ను నిర్వీర్యం చేసే ఈ ప్రక్రియ అత్యాధునిక బీఎస్‌ఎల్‌-3 లేబొరేటరీల్లో మాత్రమే సాధ్యం అవుతుంది.

అప్పుడే వైరస్‌ బయటికి రాకుండా, శాస్త్రవేత్తలకు సోకకుండా ఉంటుంది. ఈ సౌకర్యాలు ఇప్పటికిప్పుడు తయారుచేయడం సాధ్యంకాదు.

క‌నుక‌ ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాల‌ని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. భారత్‌లో ఇతర సంస్థల్లో ఇటువంటి సౌకర్యాలు లేనందుకు విదేశాల్లో తయారు చేసే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న‌ది.

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

ఇవి కూడా చ‌ద‌వండి..

జూన్ 1-6 మ‌ధ్య ఐటీ వెబ్‌సైట్ ప‌ని చేయ‌దు.. ఎందుకంటే!

ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం


అహ్మదాబాద్‌లో కుప్ప‌కూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో

సముద్ర పర్యవేక్ష‌ణ‌కు ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించిన‌ చైనా

మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవ‌ర్‌

ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవ‌చ్చు.. ఆర్‌బీఐ స‌ర్క్యుల‌ర్ జారీ

క‌మ‌ల్ హాస‌న్ కు మ‌రో షాక్: ఎంఎన్ఎంను వీడిన‌ కుమార్ వేల్

విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న క‌థ‌నాలు..!

కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?

వ్యాక్సిన్ త‌యారీ : నూత‌న‌ ఫార్మా బిలియ‌నీర్లుగా ఎదిగారు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విదేశాల్లో కొవాగ్జిన్ ఉత్ప‌త్తిపై ఫోక‌స్‌! ఎలాగంటే!!

ట్రెండింగ్‌

Advertisement