IPL Tickets : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ టికెట్లను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం దుర్వినియోగం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి పేరిట ఇచ్చే ఎలైట్ లాంజ్ టిక్కెట్లతో హీరోయిన్ కుషితా కల్లాపు (Kushita Kallapu) ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు చూసేందుకు వెళ్తోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సీఎం పేరు మీదున్న టిక్కెట్ ఫోటోలను పెట్టడంతో ఈ విషయం బయటపడింది. దాంతో, సీఎంవో టిక్కెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా? లేదంటే బ్లాక్‌లో అమ్ముతున్నారా? అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎలైట్ లాంజ్ టిక్కెట్ల విలువ రూ. 40,000లు ఉంటుంది. ఇంత ఖరీదైన టికెట్లను ఉచితంగా హీరోయిన్లకు పంచుతున్నది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. సీఎంవో మ్యాచ్ టిక్కెట్ల దుర్వినియోగం వెనుక రేవంత్ రెడ్డి సన్నిహితుడు మాజీ నిర్మాత ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్లకు గాలం వేయడానికే సదరు మాజీ నిర్మాత ఐపీఎల్ టిక్కెట్లను వారికి ఎరగా వేస్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
హీరోయిన్ చేతికి రేవంత్ రెడ్డి ఐపీఎల్ టిక్కెట్లు
తెలంగాణ సీఎంకు ఇచ్చే ఎలైట్ లాంజ్ టిక్కెట్లతో మ్యాచ్‌కు వెళ్తున్న కుషితా కల్లాపు
ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సీఎం పేరు మీద ఉన్న టిక్కెట్ ఫోటోలను స్టోరీలో పెట్టిన కుషితా
సీఎంవో టిక్కెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా ? లేకపోతే బ్లాక్… pic.twitter.com/WR6DQ2pK8v
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2026
ఇటీవల ఉప్పల్‌లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ పదుల సంఖ్యలో సీఎంవో టిక్కెట్ల దుర్వినియోగం జరిగినట్టు సమాచారం. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఐపీఎల్ టిక్కెట్లు మరొకరి చేతికి అందవని సీఎంవో అధికారులు చెబుతున్నారు. దరాబాద్‌కు చెందిన కుషితా కొల్లపు నీతోనే నేను, బాబు(నంబర్ 1 బుల్షిట్ గై), మనోహరం, చిరంజీవ వంటి చిత్రాల్లో నటించింది.