SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మళ్లీ గర్జించింది. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై చెలరేగిన బౌలర్లు ఈసారి పంజా విసరడంతో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను అలవోకగా ఓడించింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ(59), క్లాసెన్(59) అర్ధ శతకాలతో విరుచుకుపడగా.. ఇషాన్ మలింగ(3-29), నితీశ్ రెడ్డి(2-31)లు బంతితో రాణించారు. భారీ ఛేదనలో టాపార్డర్ విఫలమైనా ఆయుశ్ మాత్రే(30), శివం దూబే(21) పోరాడినా సీఎస్కేను గెలపించలేకపోయారు. మూడో విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకుంది ఆరెంజ్ ఆర్మీ.
పంతొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయంతో మురిసింది. సొంత మైదానంలో బ్యాటర్లు, బౌలర్లు రాణించగా రెండు విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది. భారీ ఛేదనను ధాటిగా మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌ను నితీశ్ రెడ్డి(2-31) ఆదిలోనే దెబ్బ కొట్టాడు. ఫామ్ అందుకున్న శాంసన్(7)ను ఔట్ చేసి అతడు బ్రేకివ్వగా.. ఇంప్యాక్ట్ సబ్ ఆయుశ్ మాత్రే(30) వస్తూనే గత మ్యాచ్ హీరో ప్రఫుల్ హింగేను ఉతికేస్తూ ఐదు ఫోర్లు రాబట్టాడు.
On Target 🎯
Sakib Hussain with the huge wicket of Shivam Dube 🔥
Updates ▶️ https://t.co/uJG04r8iXD #TATAIPL | #KhelBindaas | #SRHvCSK | @SunRisers pic.twitter.com/Yba4ahfehE
— IndianPremierLeague (@IPL) April 18, 2026
ధాటిగా ఆడుతున్న మాత్రేను క్లాసెన్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు.. కాసేపటికే రుతురాజ్ గైక్వాడ్(19)ను ఇషాన్ మలింగ(3-29) వెనక్కి పంపాడు. సర్ఫరాజ్ ఖాన్(25) సైతం ఔటవ్వగా.. డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్(0)ను ఔట్ చేసి శివాంగ్ ఐదో వికెట్ అందించాడు.
Sarfaraz Khan followed by Dewald Brevis 😮
Eshan Malinga and Shivang Kumar bring #SRH back into the contest with quick wickets 🤝
Updates ▶️ https://t.co/uJG04r8iXD #TATAIPL | #KhelBindaas | #SRHvCSK | @SunRisers pic.twitter.com/PNPz2VYGlt
— IndianPremierLeague (@IPL) April 18, 2026
అనంతరం.. మాథ్యూ షార్ట్(34) జతగా శివం దూబే(21) జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ, అనికేత్ వర్మ సూపర్ క్యాచ్ పట్టడంతో షార్ట్ ఆరో వికెట్‌గా డగౌట్ చేరాడు. అయినా దూబే క్రీజులో ఉండడంతో గెలుపుపై ధీమాతో ఉన్న చెన్నై ఆశలపై షకీబ్ నీళ్లు చల్లాడు. 17వ ఓవర్లో దూబేను బౌల్డ్ చేసిన ఈ యంగ్‌స్టర్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. నితీశ్ ఓవర్లో అన్షుల్ (12) సిక్సర్ బాదగా ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. ప్రఫుల్ వికెట్ తీసి రన్స్ మాత్రమే ఇవ్వడంతో సన్‌రైజర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(59) వేగవంతమైన అర్ధ శతకంతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడగా.. మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్(59) ఉతికేశాడు. వీరిద్దరి మెరుపులతో రెండొందలకు పైగా కొట్టేలా కనిపించిన సన్‌రైజర్స్‌ను సీఎస్కే గొప్పగా కట్టడి చేసింది. అన్షుల్ కంభోజ్(3-22), జేమీ ఓవర్టన్ (3-37) డెత్ ఓవర్లలో వికెట్ల వేటతో హైదరాబాద్‌ను 194కే పరిమితం చేసింది చెన్నై.