PM Narendra Modi : పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయినందుకు దేశంలో మహిళలు, ఆడబిడ్డలకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) క్షమాపణలు తెలిపారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ స్వార్ధ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు బిల్లును అడ్డుకున్నాయని, మహిళల హక్కులను హరించాయని మండిపడ్డారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు దేశంలోని మహిళలకు తీరని అన్యాయం చేశాయని, ప్రతిపక్షాలన్నీ కలిసి భ్రూణ హత్యకు పాల్పడ్డాయని ప్రధాని ఆక్రోషం వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 131కి రాజ్యాంగ సవరణ చేసి లోక్ సభ స్థానాలో పాటు మహిళా రిజర్వేషన్లను పెంచాలని భావించిన ఎన్డీఏ సర్కార్ ప్రయత్నాలను ప్రతిపక్షాలు నీరుగార్చాయి. శుక్రవారం జరిగిన ఓటింగ్లో మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై భగ్గుమన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేలు మహిళలు, ఆడబిడ్డలకు అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు.
My address to the nation. https://t.co/2Vyx15A4rx
— Narendra Modi (@narendramodi) April 18, 2026
జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ‘మహిళా రిజర్వేషన్ బిల్లు పాసవ్వనందుకు దేశంలోని మహిళలను నన్ను క్షమించాలని కోరుతున్నా. స్వార్థపూరిత రాజకీయాలు చేసే కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఈ బిల్లుకు అడ్డుపడ్డాయి. ఈ పార్టీల కారణంగా దేశంలోని మహిళలు ఎంతో క్షోభకు గురయ్యారు. పార్లమెంట్లో నిన్న జరిగింది కేవలం బల్లలు చరచడమే కాదు. మహిళల అభిమానం, ఆత్మగౌరవం మీద జరిగిన దాడి. పార్లమెంట్లో కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీలు వ్యవహరించిన తీరును దేశ మహిళలు ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారు’ అని పేర్కొన్నారు.
#WATCH | In his address to the nation, Prime Minister Narendra Modi says, “Today I’m here to discuss an important issue, especially for the women of this country. Every citizen of this country is witnessing how women’s progress has stalled… Despite our best efforts, we haven’t… pic.twitter.com/Y2s2hBUCz6
— ANI (@ANI) April 18, 2026
అంతేకాదు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ప్రతిపక్ష నాయకులకు శిక్ష వేయాలని మోడీ మహిళాలోకాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ ముసుగులో డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకురావాలనుకున్న మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టిన ప్రతిపక్షాలు వ్యతిరేకతంగా ఓటు వేశాయి. తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పాచిక పారలేదు.