KTR birthday | మొక్కలు నాటి.. డెన్మార్క్‌లో ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు
KTR birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని డెన్మార్క్‌లో బీఆర్ఎస్ నాయకుడు శ్యామ్ బాబు ఆకుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
KTR birthday | డెన్మార్క్‌లో బీఆర్ఎస్ నాయకుడు శ్యామ్ బాబు ఆకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, తెలంగాణ ప్రవాసులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ఒక్కొక్కరు ఒక మొక్క నాటితే భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చు’ అనే సందేశంతో పలువురు మొక్కలు నాటి వాటి సంరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా శ్యామ్ బాబు ఆకుల మాట్లాడుతూ.. కేటీఆర్ తెలంగాణ అభివృద్ధికి, పారిశ్రామిక రంగ విస్తరణకు, ఐటీ రంగ ప్రగతికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుస్థిరమైన పాలన కోసం కేటీఆర్ ఎల్లప్పుడూ కృషి చేస్తూ దేశవ్యాప్తంగా యువ నాయకులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
జన్మదిన వేడుకలను కేవలం శుభాకాంక్షలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంగా మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో పచ్చదనం పెంపొందించడంతోపాటు పర్యావరణంపై అవగాహన కూడా పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి గడ్డం, విశాల్ వెంకటశెట్టి, ఖాజా అక్తర్, రామ్‌రెడ్డి పబ్బటి, సుభాన్, వెంకట సుబాష్, శ్రీ వాసు, జగదీష్, చరణ్, మహిత, లక్ష్మి పాల్గొన్నారు.

Read Also :
CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

