Watch: కలెక్టర్‌తో రైతుల సమావేశంలో కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?
Monkey Enters Farmers Meeting | తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టర్‌తో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక కోతి అక్కడకు వచ్చింది. కలెక్టర్ కుర్చీలో అది కూర్చుకున్నది. దీంతో అక్కడ గందరగోళం చెలరేగింది.
లక్నో: తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టర్‌తో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక కోతి అక్కడకు వచ్చింది. కలెక్టర్ కుర్చీలో అది కూర్చుకున్నది. దీంతో అక్కడ గందరగోళం చెలరేగింది. (Monkey Enters Farmers Meeting) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఆ జిల్లా కలెక్టర్ అస్మితా లాల్‌తో కొందరు రైతులు వికాస్ భవన్లో సమావేశమయ్యారు. తమ సమస్యలను ఆమెకు వివరిస్తున్నారు.
కాగా, కిక్కిరిసిన ఆ హాల్లో రైతుల సమావేశం జరుగుతుండగా ఒక కోతి అక్కడకు వచ్చింది. జిల్లా కలెక్టర్ అస్మితా లాల్ ముందున్న టేబుల్‌పైకి చేరింది. దీంతో ఆమె కుర్చీ నుంచి పైకి లేచారు. ఆ కోతిని కూర్చోమనగా అది కూర్చొన్నది. కలెక్టర్ కుర్చీలో కూడా అది కూర్చున్నది. ఆ తర్వాత అక్కడున్న సిబ్బంది దానిని బయటకు పంపారు.
మరోవైపు ‘మాతృ’ అని పిలిచే ఆ కోతి కలెక్టరేట్ ప్రాంగణంలో తరచుగా కనిపిస్తుందని అక్కడి సిబ్బంది తెలిపారు. అక్కడి అధికారులు, ఉద్యోగులకు ఇది బాగా సుపరిచితమని చెప్పారు. గతంలో కూడా పలుసార్లు కలెక్టర్ అస్మితా లాల్ ముందుకు ఆ కోతి వచ్చింది. తాజాగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी : बागपत में “मटरू” लंगूर भरी मीटिंग में DM अस्मिता लाल के पास पहुंच गया। 2015 बैच की IAS अस्मिता एनिमल लवर हैं। मटरू उनका पेट एनिमल है और DM कार्यालय परिसर में ही घूमता रहता है। pic.twitter.com/gqWLDZadoA
— Sachin Gupta (@Sachingupta) April 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

