వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!

న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ల తయారీతో అధిక లాభాలను ఆర్జిస్తూ ప్రపంచంలో కొత్తగా తొమ్మిది మంది నూతన ఫార్మా బిలియనీర్లు ముందుకొచ్చారు. వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మోడెర్నా, బయో ఎన్ టెక్ సీఈఓలు రూ 28,000 కోట్ల సంపదతో ఫార్మా బిలియనీర్ల జాబితాలో దూసుకుపోయారు. ఇద్దరు మోడెర్నా వ్యవస్థాపక ఇన్వెస్టర్లు, కంపెనీ అధిపతితో పాటు కంపెనీ సీఈఓ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
చైనా వ్యాక్సిన్ కంపెనీ కన్సినో బయలాజిక్స్ సహ వ్యవస్ధాపకులు ముగ్గురు కూడా వ్యాక్సిన్ తయారీ, అమ్మకాలతో అనతికాలంలోనే శ్రీమంతులై ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు. ఇక తొమ్మిది మంది వ్యాక్సిన్ తయారీదారులు బిలియనీర్లుగా ఎదగడంతో వారి ఉమ్మడి సంపదతో పేద దేశాల ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేపట్టవచ్చని పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ పేర్కొంది.
వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యానికి తెరపడని పక్షంలో వ్యాక్సిన్ సరఫరాలు, ధరలపై ఫార్మా కార్పొరేషన్ల నియంత్రణ పెరిగి పేద దేశాలకు వ్యాక్సిన్ల నిల్వలు అందడం కష్టమవుతుందని అలయన్స్ హెచ్చరించింది. మరోవైపు వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యాన్ని నివారించి సరఫరాలు పెంచే చర్యలను జర్మనీ, బ్రిటన్ సహా జీ 20 కీలక దేశాలు అడ్డుకుంటున్నాయని అలయన్స్ ఆరోపించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

