విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!

విజయకాంత్.. ఈ పేరుకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. ముఖ్యంగా కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ కాంత్. అందుకే ఈయనను తెలుగు, తమిళ భాషలో కెప్టెన్ అని పిలుస్తారు అభిమానులు. కొన్నేళ్లుగా అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఈయన మరోసారి హాస్పిటల్ పాలయ్యారు. డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయననను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రెండు రోజులుగా విజయ్ కాంత్ ఆరోగ్యంపై చెన్నైలో విభిన్నమైన కథనాలు వస్తున్నాయి. వీటిపై అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. తమ హీరో ఆరోగ్యం గురించి ఎవరూ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అంటూ వాళ్ళు మండిపడుతున్నారు. కెప్టెన్ ఆరోగ్యంపై ఏదో దాస్తున్నారు అంటూ వాళ్ళు హాస్పిటల్ ముందు ధర్నా చేయడం సంచలనంగా మారింది. గతేడాది ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని అప్పట్లో ఆయన తెలిపారు.
వైరస్ నుంచి సురక్షితంగా బయటపడిన తర్వాత ఆయన మళ్లీ పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. మొన్న ఎన్నికల్లో బయటికి కూడా వచ్చారు. అయితే ఉన్నట్టుండి ఈయన ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరోవైపు ఈయన ఆరోగ్యం గురించి ఏ విషయం కూడా దాచిపెట్టవద్దు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవికూడా చదవండి..
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
‘హెచ్ఐవీ’ గుణపాఠాలు నేర్చుకోవాలి
నేపాల్లో వరుస భూప్రకంపనలు
టీకాల ఉత్పత్తికి అనుమతులు.. సంతోషకరం… మీ బాస్ పట్టించుకుంటారా?
రష్యాలో టీకా పర్యాటకం
కరోనాతో 28/11 ఆపరేషన్ చీఫ్ కన్నుమూత
అంత్యక్రియలు జరిపించాడు.. అందర్నీ వీడి వెళ్లాడు
కోలుకొన్నాక 3 నెలలకు టీకా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor
- Vijaykanth
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

