కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత | ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు.

జైపూర్ : ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. పహాడియా 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రి పని చేశారు. ఆ తర్వాత బిహార్, హర్యానా గవర్నర్‌గానూ సేవలందించారు. ఆయన మృతిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్‌కు గురయ్యానన్నారు. ఆయనకు మొదటి నుంచీ నాపై చాలా అభిమానం ఉందని, పహాడియా మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమని ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మృతికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశమై సంతాపం తెలుపనుంది. అధికారిక లాంఛనాలతో నేడు పహాడియా అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..?
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
రష్యాలో టీకా పర్యాటకం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

