కోలుకొన్నాక 3 నెలలకు టీకా

- తొలి డోసు వేసుకొన్నాక వైరస్ సోకితే రికవరీ అయిన 3 నెలలకు రెండో డోసు
- బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు
- కేంద్రం కొత్త మార్గదర్శకాలు
- టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు
న్యూఢిల్లీ, మే 19: కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా వేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం (ఎన్ఈజీవీఏసీ) చేసిన సిఫార్సులకు బుధవారం ఆమోదం తెలిపింది. వ్యాక్సినేషన్ విధానంలో నూతన మార్గదర్శకాలను అమలుచేయాలని రాష్ర్టాలను ఆదేశించింది.
- కొవిడ్ సోకినవారు కోలుకున్న మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలి.
- ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తర్వాత టీకా వేసుకోవాలి.
- తొలి డోసు వేసుకున్నాక కొవిడ్ సోకితే, వ్యాధి నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలి.
- ఇతర తీవ్రమైన వ్యాధులతో దవాఖాన లేదా ఐసీయూలో చికిత్స తీసుకునేవారు కోలుకున్నాక 4-8 వారాల తర్వాత టీకా వేసుకోవాలి.
- టీకా వేసుకున్న వారు, కొవిడ్ నుంచి కోలుకున్న వారు (ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రావాలి) 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు.
- బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు.
- వ్యాక్సిన్ వేసేముందు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయనవసరం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

