coronavirus exercise | కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇప్పుడిప్పుడే జనాలు ముందుకొస్తున్నారు ! కానీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందోనన్న సందేహాలు మాత్రం ఇంకా చాలామంది మెదళ్లను తొలుస్తున్నాయి. టీకా తీసుకున్నాక ఏం చేయాలి? ఏం చేయకూడదనే దానిపై ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. టీకా తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అనేది అలాంటి సందేహాల్లో ఒకటి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వర్కవుట్స్ చేస్తే టీకా సామర్థ్యం తగ్గిపోతుందేమోనన్న భయాలూ వెంటాడుతున్నాయి. మరి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా ? లేదా? వైద్యనిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు చూద్దాం..
“వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి దానికి ఎలా స్పందిస్తాడో చెప్పడం చాలా కష్టం. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తర్వాత వ్యాయామం చేయడం వల్ల టీకా సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రతి రోజు వ్యాయామం చేసేవారు, ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటించేవాళ్లు వ్యాక్సిన్‌కు తొందరగా స్పందిస్తారు. వ్యాయామం చేయని వారితో పోలిస్తే వ్యాయమం చేస్తూ హెల్తీ లైఫ్‌స్టైల్ పాటించే వారిలో యాంటీబాడీలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ” అని ముంబైలోని ఓక్హార్ట్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ ప్రీతం మూన్ తెలిపారు.
సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన ప్రదేశంలో నొప్పి లేదా వాపు, నీరసం, తలనొప్పి, జ్వరం, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దానికి తగ్గట్లు వర్కవుట్ ప్లాన్ మార్చుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుంటే ఫర్వాలేదు కానీ.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వెంటనే కొత్తగా వర్కవుట్స్ చేయడం మొదలు పెట్టకూడదు. అతిగా లేదా కొత్తగా వ్యాయామం చేయడం వల్ల కూడా వ్యాక్సిన్ తీసుకున్న చోట నొప్పి పెరిగే అవకాశం ఉందని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జూహి డాంగ్ స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే ఎక్సర్సైజ్ జోలికి వెళ్లకుండా రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల వరకు కొత్తగా వ్యాయామం చేయడం మొదలు పెట్టకూడదు. ముందు నుంచే ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటే.. కొత్త కొత్త వర్కవుట్స్ జోలికి వెళ్లకూడదు. అని ఢిల్లీ రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు శర్వారీ దాభాడే దువా తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండు మూడు రోజుల పాటు అలసట, కండరాల నొప్పి ఉంటుంది. కాబట్టి కొద్ది రోజులు వ్యాయామానికి బ్రేక్ ఇవ్వడమే మంచిదని దియోస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అభిషేక్ భన్సాల్ చెబుతున్నారు. కొద్ది రోజులు వ్యాయమం నుంచి బ్రేక్ తీసుకోవడం వల్ల కొంపలేమీ మునగవు. ఒక్క రోజులోనే బరువు పెరగడం కానీ తగ్గడం కానీ సాధ్యం కాదు. వ్యాక్సినేషన్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మన శరీరం కోలుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ మూన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
coronavirus exercise | వ్యాక్సిన్ తీసుకున్నాక ఎక్సర్సైజ్ చేయొచ్చా? లేదా? వర్కవుట్స్ చేస్తే ఏమవుతుంది?