నల్లగొండలో 25 మంది నామినేషన్లు తిరస్కరణ
వచ్చే నెల 13న జరిగే నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 56 మంది అభ్యర్థులు ఆయా పార్టీలతోపాటు స్వతంత్రంగా నామినేషన్లు వేయగా వారిలో 25 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
- 31 మంది నామినేషన్లకు ఓకే చెప్పిన అధికారులు
నల్లగొండ, ఏప్రిల్ 26 : వచ్చే నెల 13న జరిగే నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 56 మంది అభ్యర్థులు ఆయా పార్టీలతోపాటు స్వతంత్రంగా నామినేషన్లు వేయగా వారిలో 25 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగగా నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 56 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
వారిలో 31 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించగా, 25 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. వచ్చే నెల 13న పోలింగ్ నిర్వహించి, జూన్ 4న ఫలితాలు వెల్లడించనుంది.
భువనగిరిలో 10 మంది నామినేషన్లు తిరస్కరణ
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 61 మంది అభ్యర్థులు ఆయా పార్టీలతోపాటు స్వతంత్రంగా నామినేషన్లు వేయగా వారిలో 10 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 61 మంది అభ్యర్థుల్లో 51 ఆమోదించగా 10 తిరస్కరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

