గురువారం 28 మే 2020
Telangana - May 22, 2020 , 14:53:01

దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి ప్రత్యేక గదుల్లో పరీక్ష

దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి ప్రత్యేక గదుల్లో పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ప్రతి రోజూ ప్రతి పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్‌ చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే వారందరికీ మాస్కులు అందజేస్తామన్నారు. విద్యార్థులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఒక్క బెంచ్‌పై ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చుంటారని మంత్రి పేర్కొన్నారు. 

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నైట్లెతే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు పైలక్షణాలు ఉంటే.. వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్నవారితో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి గ్లౌజులను కూడా సరఫరా చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 


logo