e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News లాక్‌డౌన్‌ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి

లాక్‌డౌన్‌ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి

లాక్‌డౌన్‌ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి

ముంబై: రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతుండటంతో మరో 2 రోజుల్లో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటనతో బాలీవుడ్‌లో భయం ప్రారంభమైంది.

ఇప్పటికే ఆర్థిక నష్టాలతో ఇబ్బందిపడుతున్న సినీ పరిశ్రమను మరోసారి లాక్‌డౌన్‌ విధించి ఇబ్బందులకు గురిచేయవద్దని సినీ పరిశ్రమ మహా సీఎంకే నివేదించింది. మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధించవద్దని మహారాష్ట్ర సీఎంను వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూవైసీఈ) సమాఖ్య అభ్యర్థించింది.

గత ఏడాది విధించిన లాక్‌డౌన్ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించిందని, దీనివల్ల సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు ఎఫ్‌డబ్ల్యూవైసీఈ శుక్రవారం ఒక లేఖ రాసింది. మరోసారి లాక్‌డౌన్ విధిస్తే సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న వారందరూ మళ్లీ భారీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని, పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతుందని లేఖలో పేర్కొన్నారు.

ముంబై నగరంలోని పరిస్థితుల గురించి మేం కూడా ఆందోళన చెందుతున్నామనీ.. వినోద పరిశ్రమ యొక్క ఆర్ధికవ్యవస్థకు ఇప్పటికే హాని కలిగించినందున ఇక లాక్డౌన్ విధించవద్దని మొత్తం మీడియా, వినోద పరిశ్రమకు చెందిన నటులు, కార్మికులు, సాంకేతిక నిపుణుల తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నామని సమాఖ్య సలహాదారులు అశోక్‌ పండిత్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వివరించారు.

ఇవి కూడా చదవండి..

అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

షోఫియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

ఆర్మీ బలోపేతం వెనుక జనరల్‌ మానెక్‌షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి

ట్రెండింగ్‌

Advertisement