రామయ్య సేవలో ఎంపీ అభ్యర్థి నామా
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
భద్రాచలం, ఏప్రిల్ 23 : బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకొని అంతరాలయంలోని మూలవరుల వద్ద పూజలు చేసిన ఆయన ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలను సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంచి మెజార్టీతో విజయం సాధించి ప్రజలకు సేవలందించాలని అర్చకులు ఆశీర్వదించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, తాళ్లూరి జీవన్, మోరంపూడి ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, మండల పార్టీ నాయకులు ఆకోజు సునీల్కుమార్, నామా యూత్ నాయకుడు దుద్దుకూరి రాజా, కోలా రాజు, ఎస్కే అజీమ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమ్మ సంఘం ఆధ్వర్యంలో నామాను శాలువాతో ఘనంగా సత్కరించి, సీతారామచంద్రస్వామివారి జ్ఞాపికను అందజేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

