‘పుష్ప’ నుంచి మరో క్రేజీ అప్డేట్
పుష్ప | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. ఇందులో బన్నీ లారీ క్లీనర్ పాత్రలో నటించనున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించిన చిత్రబృందం.. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో కొంత భాగాన్ని చిత్రీకరించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్లో బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. అయితే, సినిమా నుంచి అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో త్వరలోనే ఫ్యాన్కు అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 8న బన్నీ పుట్టిన రోజుకు ముందే అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 7న 6.12 గంటలకు చిత్రానికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేయనున్నారు. పుష్పలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న బన్నీతో జతకడుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక ట్రైబల్ యువతి పాత్రను పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Here's #PreludeOfPushpaRaj
— BA Raju's Team (@baraju_SuperHit) April 3, 2021
▶️ https://t.co/4RuemklLKH
Meet #PushpaRaj on 7th April at 6:12 PM @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie #Pushpa
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/oqT13JAyP1
ఇవి కూడా చదవండి..
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
పది కోట్ల వీక్షణానందం
సృజనాత్మక చిత్రాలకు వేదిక
మెగాస్టార్ ఆచార్య ‘లాహే లాహే’ సాంగ్కు భారీ రెస్పాన్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

