శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 02, 2020 , 14:10:34

10 టన్నుల చేపలు మృతి

10 టన్నుల చేపలు మృతి

జోగులాంబ గద్వాల : జిల్లాలోని గద్వాల మండలం చెనుగొనిపల్లి చెరువులో 10 టన్నుల చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు రూ. 7 లక్షలు విలువ చేసే 10 టన్నుల చేపలు ఎండ తీవ్రతకు తాళలేక చనిపోయాయి. ఎండ వేడిమి అధికమవడం, చెరువులో చేపలు బాగా వృద్ధి చెందడం, ఆక్సిజన్‌ సరిపడినంతగా అందకపోవడంతో చేపలు మృతిచెందాయని అధికారులు తెలిపారు. ఈ చేపలు ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెరువులో వదిలిన చేపపిల్లలే.
logo