ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మియావాకి మొక్కల ప్లాంటేషన్‌ను ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ బుధవారం ప్రారంభించారు. డంపింగ్ యార్డు పరిధిలో మొక్కలు నాటారు.
పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బడుల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోనా నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను
గంగపుత్ర, ముదిరాజ్ కులాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులతో జిల్లా సబ్ కమిటీని ఎంపిక చేసినట్లు మత్స్యశాఖ రాష్ట్ర సహాయ కమిషనర్ శంకర్ రాథోడ్ వెల్లడించారు.
వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో అభయాంజనేయ స్వామి 12 అడుగుల విగ్రహ ఏర్పాటకు బుధవారం ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ నిర్వహించారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు గ్రామానికి చెందిన మొండి నవీన్ తన తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సూక్ష్మ యూనిట్లను (తెమడ తీసే యంత్రం) అందజేశారు.
నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో డైరీ ఫాం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సెకండ్ వైఫ్ కిచెన్‌ను బుధవారం నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ప్రారంభించారు.