పిట్లం/ నిజాంసాగర్/మద్నూర్/ సదాశివనగర్/ సదాశివనగర్ రూరల్/బాన్సువాడ/ బీర్కూర్, సెప్టెంబర్ 9: జిల్లాలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను గురువారం ఎన్నుకున్నారు. పిట్లం మండలం మద్దెలచెరువు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జీడిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా గంగారెడ్డి, కార్యదర్శిగా తానాజీరావు, కోశాధికారిగా రాములుతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. అన్నారం గ్రామంలో ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమేశ్, ఉపాధ్యక్షుడిగా షాదుల్, కార్యదర్శిగా విఠల్, సంయుక్తకార్యదర్శిగా దత్తు, కోశాధికారిగా జగ్రాంను ఎన్నుకున్నారు.
నిజాంసాగర్ మండలం ఒడ్డేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గోరేమియా, ఉపాధ్యక్షుడిగా నారాగౌడ్, యువజన విభాగం అధ్యక్షుడిగా దర్జి కృష్ణను ఎన్నుకున్నారు. వెల్గనూర్ గ్రామ అధ్యక్షుడిగా నాట్కారీ సంగయ్య, ఉపాధ్యక్షుడిగా మోహన్‌గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా షఫీని ఎన్నుకున్నారు. మంగ్లూర్ గ్రామ అధ్యక్షుడగా మంగలి రాములు, ఉపాధ్యక్షుడిగా దేవ్‌రాజ్, యువజన విభాగం అధ్యక్షుడిగా రమేశ్, ఉపాధ్యక్షుడిగా జనార్దన్‌ను ఎన్నుకున్నారు. జుక్కల్ మండలంలోని కెంరాజ్‌కల్లాలి గ్రామ శాఖ అధ్యక్షుడిగా సుంకరి వెంకటి, ఉపాధ్యక్షుడిగా రవి, కార్యదర్శిగా గంగాధర్‌తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
మద్నూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కంచిన్ హన్మాండ్లు, ఉపాధ్యక్షుడిగా విఠల్, ప్రధాన కార్యదర్శిగా తులసీరాంను ఎన్నుకున్నారు.
సదాశివనగర్ మండలం ధర్మారావుపేట్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా సామల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అంకం బాల్‌చంద్రం, ప్రధానకార్యదర్శిగా మామిడి బాల్‌రెడ్డి, కార్యదర్శిగా అమీన్, సంయుక్తకార్యదర్శిగా వడ్ల ఆంజనేయులు, ప్రచార కార్యదర్శిగా అలకొండ సంతోష, కోశాధికారిగా అలకొండ చిన్న ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులుగా మిద్దె సాయిలు, బండి భూమయ్య, గైని సీతారాం, చంద్రం, కమ్మరి శంకరయ్య, నారాయణ సంజీవులు కుమార్‌ను ఎన్నుకున్నారు. పద్మాజివాడి టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా నల్లవెల్లి రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా లోకోటి భాస్కర్ రావు, ప్రధానకార్యదర్శిగా నర్సాపురం చిన్న లింగం, కార్యదర్శిగా మామిండ్ల కాశయ్య, సంయుక్త కార్యదర్శిగా ఎండీ జాకీర్, ప్రచార కార్యదర్శిగా రాస రాజు, కోశాధికారిగా చౌకి సుధాకర్, కార్యవర్గ సభ్యులుగా యాల్ల గంగారెడ్డి, బత్తిని తిరుపతి, తెనుగు బాలయ్య, మామిండ్ల శివరాజు, నర్సాపురం పర్వయ్య, ఎండీ అస్గర్, బెస్త సాయిలు, సాకలి లక్ష్మణ్‌ను ఎన్నుకున్నారు.
సదాశివనగర్ మండలం ఉత్తునూర్ గ్రామశాఖ అధ్యక్షుడిగా గుడ్ల శ్రీకాంత్‌రావు, ఉపాధ్యక్షులుగా వీరన్రావు, ప్రవీణ్, బీసీ విభాగం అధ్యక్షుడిగా సంజీవ్‌రావు, ఉపాధ్యక్షుడిగా గణేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా నరేశ్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా కార్తీక్, కోశాధికారిగా రమేశ్‌రావు, కార్యదర్శిగా శ్రీను, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా రవి, మహిపాల్‌ను ఎన్నుకున్నారు. వీరికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడీల భాస్కర్ నియామకపత్రాన్ని అందజేశారు.
టీఆర్ఎస్ బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ అధ్యక్షుడిగా లక్ష్మాగౌడ్ ఎన్నికయ్యారు. విండో చైర్మన్ పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ బీర్కూర్ గ్రామ కమిటీని మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ ఆధ్వర్యంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దుంపల రాజు, ప్రధాన కార్యదర్శిగా కొరిమె రఘుతోపాటు ఆయా విభాగాల అధ్యక్షులను ఎన్నుకున్నారు. కిష్టాపూర్‌కు జెట్టి శ్రీనివాస్, చించోలికి జంగం అశోక్, అన్నారం గ్రామానికి మునిగె శ్రీనివాస్‌రెడ్డి గ్రామ అధ్యక్షులుగా ఎన్నిక కాగా.. నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. పార్టీ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప తదితరులు పాల్గొన్నారు.