నిజాంసాగర్/పిట్లం/ నాగిరెడ్డిపేట్/ లింగంపేట/ తాడ్వాయి/ ఎల్లారెడ్డి/సదాశివనగర్/రామారెడ్డి/నస్రుల్లాబాద్/బాన్సువాడ, సెప్టెంబర్ 11: టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో టీఆర్ఎస్ గ్రామకమిటీల ఎన్నిక జోరుగా కొనసాగుతున్నది. శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, సర్పంచులు, నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకొని నియామకపత్రాలను అందజేశారు.
నిజాంసాగర్ మండలంలోని మల్లూర్‌లో వైస్ ఎంపీపీ మనోహర్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాములను ఎన్నుకొని నియామకపత్రాన్ని అందజేశారు. నర్సింగ్రావుపల్లిలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దత్తారెడ్డి, ఉపాధ్యక్షుడిగా సుబ్బురి రాజును ఎన్నుకున్నారు.
జుక్కల్ మండలంలోని నాగల్గావ్ గ్రామశాఖ అధ్యక్షుడిగా సూర్యవంశీ మధు, ఉపాధ్యక్షుడిగా హరి, రైతు సంఘం అధ్యక్షుడిగా విజయ్‌పాటిల్, యూత్ అధ్యక్షుడిగా అనిల్‌కుమార్‌ను ఎన్నుకున్నారు.
పిట్లం మండలం కారేగాంలో టీఆర్ఎస్ నాయకుడు విజయ్ ఆధ్వర్యంలో గ్రామకమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జైపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బీర్సింగ్, కార్యదర్శిగా కృష్ణను ఎన్నుకున్నారు. ధర్మారంలో అధ్యక్షుడిగా జిన్న లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా రఘు, కార్యదర్శిగా శంకర్, మార్దండలో అధ్యక్షుడిగా అంజయ్య, కార్యదర్శిగా శ్రీను, గోద్మేగాంలో అధ్యక్షుడిగా చింతల భాగయ్య, ఉపాధ్యక్షుడిగా పీరయ్య, కార్యదర్శిగా సాయిరెడ్డి, జగదాంబ తండా అధ్యక్షుడిగా మలావత్ విఠల్, ఉపాధ్యక్షుడిగా మెగావత్ దశరథ్, కార్యదర్శిగా మెగావత్ గోవింద్‌ను ఎన్నుకున్నారు. కోమటిచెరువు తండాలో ఏఎంసీ చైర్మన్ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సవాయిసింగ్, ఉపాధ్యక్షుడిగా దేవ్యానాయక్, కార్యదర్శిగా బాబు, సంయుక్త కార్యదర్శిగా టోప్యానాయక్, గౌరారం తండాలో టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా బుజ్జిబాయి, ఉపాధ్యక్షురాలిగా నీరిబాయి, కార్యదర్శిగా నీతాబాయి, కోశాధికారిగా యశోదాబాయి, సలహాదారులుగా మునీబాయి, సుజాత, బుజ్జి, శాంతిబాయిను ఎన్నుకున్నారు. రాంపూర్ అధ్యక్షుడిగా చాకలి శంకర్, ఉపాధ్యక్షుడిగా వీరేశం, కార్యదర్శిగా బాల్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కృష్ణాగౌడ్, కోశాధికారిగా వీరయ్యను ఎన్నుకున్నారు.
నాగిరెడ్డిపేట మండలంలోని ఆరు గ్రామాల్లో శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య తెలిపారు. వదల్పర్తి గ్రామ అధ్యక్షుడిగా సింగం శివరాజులు, ప్రధానకార్యదర్శిగా పర్మళ్ల లింగం, ధర్మారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జోడు శ్రీనివాస్, ప్రధానకార్యదర్శిగా ఉచ్చు నారాయణ, కన్నారెడ్డి అధ్యక్షుడిగా పేరుపలి భిక్షపతి, ప్రధానకార్యదర్శిగా పేరుపల్లి బాలకృష్ణ, గోపాల్పేట్ అధ్యక్షుడిగా బడిగె సాయిలు, ప్రధానకార్యదర్శిగా అంజయ్య, వెంకంపల్లి అధ్యక్షుడిగా సత్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా ఆకిడి పెంటరెడ్డి, మాసన్పల్లి అధ్యక్షుడిగా గంగబోయిన సంగయ్య, ప్రధానకార్యదర్శిగా బొల్లారం రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
లింగంపేట మండలంలోని లింగంపల్లి గ్రామ కమిటీని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుమ్మరి భీమయ్య, ఉపాధ్యక్షుడిగా జక్క పెంటయ్య, ప్రధానకార్యదర్శిగా దొడ్లె రాజాగౌడ్, సహాయ కార్యదర్శిగా చౌడం స్వామి, కోశాధికారిగా అంజయ్యతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు.
తాడ్వాయి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కాళోజీవాడి, ఎర్రాపహాడ్, కరడ్‌పల్లిలో గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి తెలిపారు.
ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో కమిటీలను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి తెలిపారు. వెల్లుట్లపేట అధ్యక్షుడిగా రాజాగౌడ్, ఉపాధ్యక్షుడిగా బొల్లు రాజులు, ప్రధానకార్యదర్శిగా గాండ్ల సాయిరాంను ఎన్నుకున్నారు. సోమార్పేట అధ్యక్షుడిగా రాగుల సాయిలు, ప్రధాన కార్యదర్శిగా గంజి బాలవీర్, తిమ్మారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శివకుమార్, ప్రధానకార్యదర్శిగా గోలి శ్రీనివాస్, మీసాన్‌పల్లి అధ్యక్షుడిగా మద్దూరి భాగయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏగుల సాయిబాబా, బ్రాహ్మణపల్లి అధ్యక్షుడిగా మాటూరి శివయ్య, ప్రధానకార్యదర్శిగా గాదె వెంకటి, తిమ్మారెడ్డి తండా అధ్యక్షుడిగా కోల రవినాయక్, ప్రధాన కార్యదర్శిగా మాలోత్ రవి, భిక్నూర్ అధ్యక్షుడిగా మేతరి ఆంధ్రయ్య, ప్రధానకార్యదర్శిగా గోనే గంగారాం, రుద్రారం అధ్యక్షుడిగా శేఖ బాలప్ప, ప్రధాన కార్యదర్శిగా మద్ది కుమార్, శివ్వాపూర్ అధ్యక్షుడిగా కంబం గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా బెండల సామెల్, వెల్లుట్ల అధ్యక్షుడిగా నాటకారి నాగభూషణం, ప్రధానకార్యదర్శిగా బేగం కాశీరాంను ఎన్నుకున్నారు.
సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు గడీల భాస్కర్ తెలిపారు. అడ్లూర్ ఎల్లారెడ్డి అధ్యక్షుడిగా కుమ్మరి రాజయ్య, ఉపాధ్యక్షుడిగా నల్లవెల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఆస మహేశ్, కార్యదర్శిగా చిన్నరాములు మహేశ్, సంయుక్త కార్యదర్శిగా రంగ మోహన్, ప్రచార కార్యదర్శిగా లింగం, కోశాధికారిగా శ్రీనివాస్‌రెడ్డితోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. కుప్రియాల్ అధ్యక్షుడిగా సామల సంతోష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వడ్ల భాస్కర్, ప్రధానకార్యదర్శిగా సాకలి లింగం, కార్యదర్శిగా బాణాల భగవంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా బానాల సంతోష్ రెడ్డి , ప్రచార కార్యదర్శిగా జంగం గారి సాయిలు, కోశాధికారిగా మల్లేశ్‌తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. మోడెగామ అధ్యక్షుడిగా గౌడెల్లి గంగాధర్, ఉపాధ్యక్షుడిగా పిల్లి రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా లోకుల శ్రీనివాస్, కార్యదర్శిగా జోగిని సత్తయ్య, సంయుక్త కార్యదర్శిగా జోగిని లింగం, ప్రచార కార్యదర్శిగా కేసీ రాజిరెడ్డి, కోశాధికారిగా మచ్చర్ల కిష్టయ్యతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. జనగామ అధ్యక్షుడిగా తన్నీరు ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా లచ్చారాం, ప్రధానకార్యదర్శిగా ముల్గె రాజ్‌కుమార్, కార్యదర్శిగా ఓడ్డె సంజీవులు, సంయుక్త కార్యదర్శిగా పసుపుల రాములు, ప్రచార కార్యదర్శిగా అంభీర్ శ్యాంరావు, కోశాధికారిగా లక్ష్మారెడ్డితోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. భూంపల్లి అధ్యక్షుడిగా గడీల దత్తురావు, ఉపాధ్యక్షుడిగా వురడి కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, కార్యదర్శిగా నర్సింహులు, సంయుక్త కార్యదర్శిగా నందం, ప్రచార కార్యదర్శిగా మొగ్గం గంగారాజు, కోశాధికారిగా రాజయ్యతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. తుక్కోజివాడి అధ్యక్షుడిగా మదుపట్ల రాజు, ఉపాధ్యక్షుడిగా అశోక్, ప్రధాన కార్యదర్శిగా గంగాధర్, కార్యదర్శిగా వడ్ల అశోక్, సంయుక్త కార్యదర్శిగా అశోక్ రావు, ప్రచార కార్యదర్శిగా మదుపట్ల సుమన్, కోశాధికారిగా చిన్న రాజయ్య, లింగంపల్లి అధ్యక్షుడిగా పెద్దబీర సధాకర్ రావు, ఉపాధ్యక్షుడిగా గుండెల్లి సాయిలు, ప్రధాన కార్యదర్శిగా పెద్దబీర చందర్రావు, కార్యదర్శిగా సాకలి సతీశ్, సంయుక్త కార్యదర్శిగా గంగాధర్, ప్రచార కార్యదర్శిగా సందీప్, కోశాధికారిగా ఎడ్ల రాజేందర్‌ను ఎన్నుకున్నారు.
రామారెడ్డి మండలం గోకుల్తండాలో గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా బల్యా, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా సేవ్యా నాయక్ తదితరులను ఎన్నుకున్నారు.
నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్‌తండా టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రమేశ్, కార్యదర్శిగా పాల్త్య రవి, రాములగుట్ట తండాలో అధ్యక్షుడిగా మోతీలాల్, కార్యదర్శిగా చీల్యానాయక్, బస్వాయిపల్లి అధ్యక్షుడిగా అనుముల రాజశేఖర్, కార్యదర్శిగా సంగొండను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్ తెలిపారు.
బాన్సువాడ పట్టణంలోని 11వ వార్డు అధ్యక్షుడిగా వాంకరి రమేశ్, మైనార్టీ, బీసీ, యూత్ సెల్ అధ్యక్షుడిగా అజీం, శంకర్, నవీన్‌ను బల్దియా చైర్మన్ జంగం గంగాధర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మద్నూర్ మండలంలో గ్రామ కమిటీల ఎన్నిక పూర్తి
మద్నూర్, సెప్టెంబరు 11 : మండలంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక పూర్తయినట్లు పార్టీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్ తెలిపారు. మండలంలోని 34 గ్రామాల్లో కమిటీలను ఎన్నుకున్నామని తెలిపారు. పెద్ద టాక్లిలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా హైమద్హుస్సేన్ను శనివారం ఎన్నుకున్నామని తెలిపారు.