ఖలీల్‌వాడి: క్రీడలతో మానసిక వికాసం కలుగుతుందని జేసీఐ అధ్యక్షుడు పెందోటి చంద్రశేఖర్ అన్నారు. జేసీఐ వీక్ వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. నగరంలోని గంగాస్తాన్‌లో క్యూరియెస్ తైక్వాండ్ అకాడమీ ఆధ్వర్యంలో పరుగు పందెం, క్రికెట్‌ను బోర్గాం హై స్కూల్లో నిర్వహించారు.
కబడ్డీ పోటీలు, సాహితీ పాఠశాలలో నిర్వహించామని తెలిపారు. 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, గెలుపొందిన క్రీడాకారులకు బమతులు, ప్రశంసపత్రాలు ఈ నెల 15వ తేదీన ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి చేతులా మీదుగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ సీహెచ్ గంగాధర్, హన్మాండ్లు, ఆదిత్య, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.