నిజామాబాద్, సెప్టెంబర్ 11: పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్సీ కవిత శనివారం పరామర్శించారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ తండ్రి భూమయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మోపాల్ మండలం బోర్గాం (పీ) గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ భూమారెడ్డి కూతురు డాక్టర్ అర్పిత రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. రెండు కుటుంబాలను ఎమ్మెల్సీ పరామర్శించారు. బోర్గాం (పీ) గ్రామంలోని భూమారెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఓదార్చారు. నల్లవెల్లి గ్రామంలో సాంబారి భూమయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సాంబారి మోహన్‌ను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని చైర్మన్‌కు ఆమె భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంట రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నుడా చైర్మన్, ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, గల్ఫ్ అసోసియేషన్ ప్రతినిధి కోటపాటి నర్సింహనాయుడు తదితరులు ఉన్నారు.