నిజామాబాద్లో ఐసీడీఎస్ ప్రాజెక్టులు
ఆర్మూర్, భీమ్గల్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్
మొత్తం అంగన్వాడీ కేంద్రాలు 1500
0-7 ఏండ్లలోపు చిన్నారులు 1,22,535
గర్భిణులు 15,978
బాలింతలు11,886
కోటగిరి సెప్టెంబర్ 11: పిల్లలు బలిష్టంగా, చురుగ్గా ఉండి , ఎత్తు పెరుగడానికి పోషక విలువలున్న ఆహారం ఎంతో ముఖ్యం. పోషకాహార లో పం ఉంటే అనారోగ్యసమస్యలకు దారితీస్తా యి. పోషకాహారంలో సమపాళ్లలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఉండడంతో చిన్నారుల పెరుగుదలకు, అభివృద్ధికి తోడ్పడుతాయి. చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది.
పోషకాహార
లోపాన్ని గుర్తించడమిలా..
పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ పరికరాలను ఉపయోగిస్తున్నారు. పిల్లల బరువు తూకం వేయడం, ఎత్తును కొలవడం, కిశోర బాలికల, గర్భిణుల బరువును లెక్కిస్తారు. పిల్లల జబ్బ చుట్టు కొలత చూడడంతో పోషణ లోపాన్ని గుర్తించవచ్చు. 12.5 సెంటీమీటర్లు ఆపైన జబ్బ చుట్టుకొలత ఉంటే పోషణ లోపం లేనట్లుగా, 12.4 సెంటీమీటర్ల నుంచి 11.5 సెంటీమీటర్లు చుట్టుకొలత ఉంటే కొద్దిగా తక్కువ పోషణ లోపం ఉన్నట్లు, 11.5 సెంటీమీటర్ల కన్నా తక్కువ చుట్టు కొలత ఉంటే అతి తీవ్ర పోషణ లోపంగా గుర్తిస్తారు.
పెరటి తోటల పెంపకం..
పోషణ మాసంలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పెరటి తోటల పెంపకాన్ని తప్పక చేపట్టాల్సి ఉంటుంది. ఈ నెల 30వ తేదీ లోపు పెంపకాన్ని చేపట్టాలి. స్థలం సమస్య ఉన్నవారు టబ్బులు, బకెట్లలో తోటలను పెంచాలి. ఇంట్లో ఉండే వ్యర్థాలను వినియోగించి సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యకరమైన కూరగాయలను పండించాలి. కరివేపాకు, గోంగూర, మెంతికూర, చుక్కకూర వంటి కూరగాయలను సులువుగా పండించవచ్చు.
అవగాహన కల్పించాలి..
పిల్లల్లో పోషణ లోపంతో ఏర్పడే సమస్యలను గుర్తించి వారికి అవసరమైన ప్రొటీన్లను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పోషణ మాసం నిర్వహిస్తున్నది. దీనిపై ప్రజలకు అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఎత్తు, బరువులను తూచే పరికరాలను రోజూ శానిటైజ్ చేయిస్తున్నాం.
పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు..
అంగన్వాడీల్లో చేపట్టే కార్యక్రమాలు