Nagoba Jatara : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara) సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. రూ.20 లక్షలకుపైగా ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు
Minister Konda Surekha | ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని(Nagoba temple) మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి దర్శించుకున్నారు.
ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర(Nagoba Jatara)కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర (Nagoba Jatara) ఆదివారం అర్ధ రాత్రి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది.
ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాను మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు.
KCR | ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసి వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jathara) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయన�
నాగోబా మహాజాతర కోసం మెస్రం వంశీయులు సోమవారం రాత్రి కెస్లాపూర్ మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గోదావరి నదిలోని హస్తలమడుగులో గత నెల 28న గంగాజలంతో బయల్దేరి�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో వేల ఏళ్ల చరిత్ర గల నాగోబా ఆలయాన్ని మెస్రం వంశీయులు అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేక గ్రానైట్ రాయితో కళాత్మకంగా తీర్చిదిద్దారు.