Silver, gold Prices | రూ.2,000 తగ్గిన బంగారం ధర.. రూ.11,000 తగ్గిన వెండి.. 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే
Silver, gold Prices | భారతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీతోపాటు పలు పట్టణాల్లో ఏకంగా నాలుగు శాతం వరకు తగ్గుదల కనిపించింది. బంగారం ధరలు రూ.2,000 (1.21 శాతం) వరకు తగ్గాయి.
Silver, gold Prices | భారతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీతోపాటు పలు పట్టణాల్లో ఏకంగా నాలుగు శాతం వరకు తగ్గుదల కనిపించింది. బంగారం ధరలు రూ.2,000 (1.21 శాతం) వరకు తగ్గాయి. వెండి కిలో ధర రూ.11,000 (3.97 శాతం) తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.1,63,200కు చేరింది.
అంతకుముందు రోజు దీని ధర రూ.1,65,200గా ఉంది. ఇక వెండి కిలో నేడు రూ.2.65 లక్షలు పలికింది. గురువారం వెండి కిలో ధర రూ.2,76,500గా ఉంది. అమెరికా డాలర్ విలువ పెరగడం, ద్రవ్య సడలింపులకు సంబంధించి మారుతున్న అంచనాలతో దేశీయంగా బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అలాగే ఇరాన్ సంక్షోభం, క్రూడాయిల్ పెరుగుదల, ద్రవ్యోల్బణం భయం కారణంగా సెంట్రల్ బ్యాంకులు మరికొంత కాలం కఠిన వైఖరి ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ సంక్షోభం తొలగిపోతే మార్కెట్ మరింత చక్కబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ధరలు దాదాపు ఒక శాతం తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 83.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా ఒక ఔన్స్ ధర 5,088 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

