హైదరాబాద్ : నాటి ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా పని చేసిన మాజీ పోలీసు ఉన్నతాధికారి హెచ్ జె దొర మరణం( HJ Dora ) పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) సంతాపం ప్రకటించారు. పోలీస్ శాఖలో పలు హోదాల్లో బాధ్యతలను చేపట్టి, వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం హెచ్ జె దొర కృషి చేశారని కొనియాడారు.హెచ్‌జే దొర మరణం పట్లు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్ జే దొర ( HJ Dora ) నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు.
కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధ పడుతూ డయాలసిస్ చేయించు కుంటున్నారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడం తో నిమ్స్ ఏఆర్సీయూ చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
1965 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన దొర ఉమ్మడి ఏపీలో మొదట అడిషనల్ డీజీపీగా అనంతరం డీజీపీగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొర 1993లో పీపుల్స్‌వార్ గ్రూప్ లక్ష్యంగా చేసుకున్న 40 మంది కీలక పోలీసు అధికారుల జాబితాలో ఆయన పేరుకూడా ఉంది.