ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని(Nagoba temple) మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి మెస్రం వంశీయులతోపాటు ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. నాగోబా దేవతల ఫొటోలు అందజేశారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. వీరి వెంట రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేద్మకి ఆనంద్ రావు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Mains Exam | నేడు గ్రూప్-1 తుది తీర్పు..హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ