హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : అనేక మలుపులు తిరిగిన గ్రూప్-1 మెయిన్స్ తుది తీర్పు గురువారం రానున్నది. హైకోర్డు డివిజన్ బెంచ్ నేడు తీర్పు వెలువరించనున్నది. ఇప్పటికే గ్రూప్-1 నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్ నియామక పత్రాలు సైతం అందజేసింది. గతం లో హైకోర్టు సింగిల్ బెంచ్ ఫలితాలు రద్దుచేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పై డివిజన్ బెంచ్ స్టే విధించి, తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని స్పష్టంచేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ సీజన్లో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 209 ప్రత్యేక రైళ్ల ద్వారా కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని బుధవారం రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 18 వరకు ప్రత్యేక రైళ్లను నడిపామని పేర్కొన్నారు. నిరుడు కంటే ఈసారి 10లక్షల మంది ప్రయాణికులు అధికంగా ప్రయాణించినట్టు తెలిపారు.