రిలయన్స్ పవర్‌పై ఈడీ దాడులు
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్, ముంబైలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.
- హైదరాబాద్, ముంబై కార్యాలయాల్లో సోదాలు
న్యూఢిల్లీ, మార్చి 6: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్, ముంబైలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. కనీసం 10-12 చోట్ల దాదాపు 15 బృందాలు తనిఖీలు చేసినట్టు చెప్తున్నారు. కాగా, విదేశీ మారకం నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఆర్థిక అవకతవకలేగాక, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద బ్యాంక్ మోసం ఆరోపణలపై అనిల్ అంబానీకి చెందిన వివిధ సంస్థలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ విచారణలో భాగంగా అనిల్ అంబానీని ఈడీ అధికారులు రెండుసార్లు ప్రశ్నించిన సంగతి విదితమే. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈడీ ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసినది తెలిసిందే. మరోవైపు ఈడీ దాడులను రిలయన్స్ పవర్ ఖండించింది. ముంబై, హైదరాబాద్‌ల్లోని తమ కార్యాలయాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తమ దృష్టికి రాలేదని స్టాక్ ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

