ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర(Nagoba Jatara)కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. బుధవారం సైతం వందలాది మంది నాగోబాను దర్శించుకున్నారు. గంటల తరబడి బారులు తీరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా దర్శనం చేసుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా రావడంతో ఆలయంతో పాటు జాతరలో ఎటుచుసినా భక్తుల రద్దీ కనిపించింది. యువతీయువకులతో రంగుల రాట్నాల వద్ద సందడి నెలకొంది. జాతరకు తరలివచ్చిన ప్రజలు జాతరలో వెలిసిన దుకాణలో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తూ సందడిగా గడిపారు.