ఇంద్రవెల్లి, జనవరి 28 : కేస్లాపూర్లో నాగో బా ఉత్సవాలు మంగళవారం అర్ధరాత్రి సం ప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా ప్రా రంభమయ్యాయి. నాగోబాకు మహాపూజ ని ర్వహించేందుకు మెస్రం వంశీయులు ఉద యం 11 గంటలకు శ్రీకారం చుట్టి.. రాత్రి 12 గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు. జాతర అధికారికంగా 28 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ ఈవో రాజమౌళి తెలిపారు. మహాపూజకు ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది మెస్రం వంశీయులు, ఆదివాసులు తరలిరావడంతో నాగో బా ఆలయం కిక్కిరిసింది.
కేస్లాపూర్‌లోని పురాతన(మురాడి) నాగోబా విగ్రహంతో మెస్రం వంశీయులు భాజా భజంత్రీలతో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించి ఆలయంలోకి ప్రవేశించారు. పురాతన విగ్రహాన్ని గర్భగుడిలోని నాగోబా విగ్రహం వద్ద ఏర్పా టు చేసి, నాగోబా దేవత, సతీదేవత, బాన్దేవత, పుర్సపేన్ దేవతకు పూజలు చేసి దర్శించుకున్నారు.