తుంగతుర్తి, మార్చి 13 : మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మసీదులో ముస్లింలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మాట్లాడారు. రంజాన్ ముస్లిం సోదరులకు పవిత్ర మాసమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, గుండగాని దుర్గయ్య, తడకమల్ల రవికుమార్, కరుణాకర్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేశ్ పాల్గొన్నారు.