Nagoba Jatara : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara) సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. మంగళవారం నిర్వహించిన హూండీ లెక్కింపులో రూ.20 లక్షలకుపైగా ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. మెస్రం వంశీయులు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఐటీడీఏకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో నాగోబా హూండీ లెక్కింపు జరిగింది. మొత్తం రూ. 20,74,797 రూపాయలు వచ్చినట్లు ఈవో వెల్లడించారు.
జాతరలోని తైబజార్ ద్వారా రూ.11,81,000 వచ్చిందని, నాగోబాను దర్శించుకున్న భక్తులు హూండీలో వేసిన కానుకలు, డబ్బులను లెక్కించగా రూ. 8,93,797 రూపాయలు వచ్చాయని ఈవో రవి కుమార్ తెలిపారు. 252 గ్రాములు వెండి కూడా వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్. మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్,
ఆలయ ఈవో రవికుమార్. ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్ రావ్. సర్పంచ్ మెస్రం తుకారాం. మాజీ సర్పంచ్ మెస్రం నాగ్ నాథ్. కటోడ కోసేరావ్. కటోడ హనుమంత్ రావ్. పర్ధాంజీ దాదారావ్. పేన్ కోత్వాల్ తీరుపతి. మెస్రం వంశీయులు, తదితరులు పాల్గొన్నారు. నాగోబా జాతర ముగిసి మూడు రోజుల అవుతున్నా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు.