నాగర్‌కర్నూల్, మార్చి 4 : నాగర్‌కర్నూల్ జిల్లాలోని కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భవతి చేసింది బాలుడు కాదని, బాలిక దగ్గరి బంధువు అని నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ బాలిక బంధువు గంగరాజు వల్ల గర్భం దాల్చినట్లు విచారణలో తెలిందన్నారు. కడుపునొప్పి రావడంతో తల్లితోపాటు దవాఖానకు వచ్చి నాగర్‌కర్నూల్‌లోని ఓ స్కానింగ్ సెంటర్లో ప్రసవించిన విషయం తెలిసిందే. మొదట బాలుడి ద్వారా గర్భం దాల్చినట్లుగా బాలిక తప్పు డు సమాచారం ఇచ్చిదన్నారు.
బాలిక ఇంటి పక్కనే ఉం టున్న దగ్గరి బంధువు ఇద్దరు పిల్లల తండ్రి అయిన గంగరాజు పదో తరగతి చదువుతున్న సమయం నుంచే బాలికను ప్రేమపేరుతో మోసం చేస్తూ వచ్చాడని, ఇంటర్ చదువుతున్న క్రమంలో ఇంటికి వచ్చినప్పుడల్లా గంగరాజు శారీరకంగా వాడుకున్నాడని విచారణలో తేలిందన్నారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చినా లూజుగా ఉండే డ్రెస్సులు వేస్తూ పాఠశాలలో టీచర్లను, ఇంటి వద్ద తల్లిదండ్రులకు విషయం తెలియకుం డా కప్పి పుచ్చిందన్నారు. ఇంతలో నెలలు నిండగా పరీక్షలు కూడా దగ్గర పడ్డాయని, గత రెండు రోజుల కిందట ఉద యం పరీక్ష రాసి కడుపునొప్పి వస్తుందని తల్లితో నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చిందన్నారు.
స్కానింగ్ తీసుకొని రావాలని చెప్పడంతో పక్కనే ఉన్న స్కానింగ్ సెంటర్లకు వెళ్లిన బాలిక బాత్రూమ్కు వెళ్లి అక్కడే ప్రసవించిందన్నారు. దీంతో పుట్టిన బిడ్డను వదిలి వెళ్లేందుకు ప్రయత్నించగా స్కానింగ్ సెంటర్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో తల్లి బిడ్డను ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు. మొదటగా బాలిక చెప్పిన వివరాల ప్రకారం బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. బాలిక చెబుతున్న విషయాలకు, బాలుడు చెబుతున్న వివరాలకు పొంతన లేకపోవడంతో మరోసారి బాలికను విచారించగా తమ ఇంటిపక్కన ఉన్న బంధువు గంగరాజు ప్రేమ పేరుతో మోసం చేశాడని తెలిపిందని డీఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు గంగారాజుపై పోక్సోతోపాటు లైంగికదాడికి సంబం ధించిన కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా వుండ గా బాలిక గర్భందాల్చి తొమ్మిది నెలలు నిండు గర్భిణిగా ఉన్నా పాఠశాలలో పర్యవేక్షకులుగా ఉన్న ఉపాధ్యాయులు కానీ, అటు ఇంటి వద్ద తల్లిదండ్రులు కానీ, తోటి విద్యార్థినులు కానీ గుర్తించకపోవడం గమనార్హం.
మైనర్ బాలిక ప్రసవం ఘటనపై విచారణ
కోడేరు, మార్చి 4 : జిల్లాలోని కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న బాలిక ప్రసవ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ బుధవారం విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని ప్రత్యేక అధికారిణితోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ము ఖ్యంగా బాలిక గర్భం దాల్చిన విషయాన్ని ఎందు కు గుర్తించలేకపోయారని ఆరా తీశారు. బాలిక తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న గుర్తించకపోవడం అనేది ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యమేనని ఆమె మండిపడ్డారు.